షాకింగ్ : గుడ్డివాడిగా రామ్

న‌వ‌త‌రం హీరోలు ఛాలెంజ్‌ల‌ను బాగానే స్వీక‌రిస్తున్నారు. రొటీన్ పాత్ర‌ల్ని ప‌క్క‌న పెట్టి స‌వాల్ విసిరే పాత్ర‌ల‌వైపు మొగ్గు చూపిస్తున్నారు. అందుకే వెండి తెర‌పై కొత్త‌ర‌కం సినిమాల్నిచూసే అవ‌కాశం ద‌క్కుతోంది. ఇప్పుడు రామ్ కూడా అదే చేయ‌బోతున్నాడు. గుడ్డివాడిగా న‌టించ‌డానికి ఒప్పుకొని అంద‌రికీ షాక్ ఇచ్చాడు. నేను శైల‌జ‌తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన రామ్‌.. త్వ‌ర‌లో అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ప‌టాస్‌, సుప్రీమ్ ల త‌ర‌వాత అనిల్ చేయ‌బోయే హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ సినిమాలో రామ్ గుడ్డివాడిగా క‌నిపించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని అనిల్ రావిపూడి ట్విట్ట‌ర్‌లో ధృవీక‌రించాడు కూడా.

రామ్ ప్ర‌స్తుతం సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సెప్టెంబ‌రులో షూటింగ్ పూర్త‌వుతుంది. ఈలోగా.. అనిల్ స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేసేస్తాడ‌ట‌. ఎన‌ర్జిటిక్ రామ్‌ని గుడ్డివాడి పాత్ర‌లో ఊహించుకోని అనిల్ సాహ‌సం చేస్తే… ఆ పాత్ర‌ని రామ్ ఒప్పుకొని ఓ సంచ‌ల‌నానికి తెర‌లేపాడు. మ‌రి వీరిద్ద‌రూ తెర‌పై ఏం చూపిస్తారో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close