క‌బాలి సీక్రెట్ చెప్పిన ద‌ర్శ‌కుడు…

దేశ‌మంతా ర‌జ‌నీ మానియా ప‌ట్టుకొంది. అంతటా క‌బాలి గురించే చ‌ర్చ‌. క‌బాలి విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ… ర‌జ‌నీ అభిమానుల్లో అంచ‌నాలు ఆకాశానికి అంటుతున్నాయి. దానికి తోడు చిత్ర‌బృందం కూడా వినూత్న రీతిలో ప‌బ్లిసిటీ చేస్తోంది. క‌బాలి పాట‌లు ఒకొక్క‌టీ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ్‌. టీజ‌ర్లో డైలాగులు అభిమానుల్ని ఉర్రూత‌లూగిస్తున్నాయి. క‌బాలిలో ర‌జ‌నీ స్టైల్ గురించి జ‌నం మాట్లాడుకొంటున్నారు. తెల్ల‌టి గ‌డ్డం, తెల్ల జుత్తుతో ర‌జ‌నీ ఇంకా స్టైలీష్‌గా క‌నిపిస్తున్నాడు. ర‌జ‌నీకాంత్‌ని ఇలా చూపించాల‌న్న ఆలోచ‌న ద‌ర్శ‌కుడు రంజిత్ పాకి ఎలా వ‌చ్చింది?? ఈ సీక్రెట్‌ని రంజిత్ చెప్పేశాడు.

క‌బాలి క‌థ చెప్ప‌డానికి ర‌జ‌నీ కాంత్ ఇంటికి వెళ్లాడ‌ట రంజిత్‌. అప్పుడు ర‌జ‌నీకాంత్ తెల్ల‌గడ్డం, తెల్ల‌జుత్తుతో మెరుస్తూ క‌నిపించార‌ట‌. ఆ గెట‌ప్పేనా సినిమాలో ఎందుకు ఉండ‌కూడ‌దు అని రంజిత్‌కి అనిపించ‌దట‌. దాన్నే ఫాలో అయిపోయాడు. ”ర‌జ‌నీసార్‌కి స‌హ‌జంగా క‌నిపించ‌డ‌మే ఇష్టం. నాకూ ఆయ‌న‌లో అదే న‌చ్చింది. మేక‌ప్‌లేకుండానూ ఆయ‌న స్టైల్ గా క‌నిపించారు. నా సినిమాలోనూ ఆయ‌న్ని అలానే చూపించాల‌ని డిసైడ్ అయ్యాను. అందుకు ర‌జ‌నీసార్ కూడా ఒప్పుకొన్నారు” అంటూ ర‌జ‌నీ స్టైల్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టాడు ద‌ర్శ‌కుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉరవకొండ రివ్యూ : మరోసారి పయ్యావుల కేశవ్‌కే కిరీటం

ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా...

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

రైతు భరోసా స్టార్ట్ … క్రెడిట్ బీఆర్ఎస్ దేనా..?

రైతు భరోసాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కేసీఆర్ తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల వేళ పెట్టుబడి కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతుండటంతో ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close