ఆ సినిమాలోంచి స‌మంత‌ని తీసేశారా?

ధ‌నుష్‌తో క‌ల‌సి ఓ త‌మిళ సినిమాలో న‌టిస్తోంది స‌మంత‌. ‘వ‌డ చెన్నై’ అనే పేరు పెట్టారు. ఈ సినిమాపై స‌మంత చాలా హోప్స్ పెట్టుకొంది. స‌మంత చేతిలో ఉన్న త‌మిళ చిత్రం అదొక్క‌టే. అయితే… ఈ సినిమాలోంచి స‌మంతని ప‌క్క‌న పెట్టారని తెలుస్తోంది. ఇటీవ‌ల స‌మంత పెళ్లి చేసుకొంటోంద‌న్న వార్త‌లు గుప్పుమ‌న్నాయి. స‌మంత పెళ్లికి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టు.. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు చెప్పుకొంటున్నారు. పెళ్ల‌య్యాక‌.. క‌నీసం కొన్ని నెల‌లు సినిమాల‌కు స‌మంత దూరం అవ్వ‌డం ఖాయం. ఆ భ‌యంతోనే ఈ సినిమా నుంచి స‌మంత‌ని ప‌క్క‌న పెట్టార‌ని తెలుస్తోంది.

ఈ చిత్రానికి ధ‌నుష్ నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గానే.. స‌మంత బ‌దులు మ‌రో క‌థానాయిక‌ని ఎంచుకోవాల‌నుకొంటున్నాడ‌ట‌. ప్ర‌త్యామ్నాయ మార్గాల‌నూ ధ‌నుష్ అన్వేషిస్తున్నాడ‌ని, మ‌రో క‌థానాయిక‌ని లైన్‌లోకి తీసుకొచ్చాడ‌ని చెప్పుకొంటున్నారు. ఇందుకు సంబంధించి ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ స‌మంత‌తో చ‌ర్చ‌లు జ‌రిపాడ‌ని… `ఒక‌వేళ త‌న‌ని ప‌క్క‌న పెట్టాల‌నుకొంటే ఎలాంటి అభ్యంత‌రం లేదు` అంటూ స‌మంత క్లారిటీగా చెప్పేసింద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close