కామన్ సివిల్ కోడ్ కి సిద్ధమౌతున్న రంగం!

కామన్ సివిల్ కోడ్ కి సిద్ధమౌతున్న రంగం!
ముస్లిం మహిళల్లో చైతన్యమే మూలం!!

దేశమంతటికీ ఒకే పౌరచట్టం “కామన్ సివిల్ కోడ్” కామన్ సివిల్ కోడ్ అమలు చేసే విషయమై సూచనలు ఇవ్వాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ అధికారిక ఉత్తరం ద్వారా లా కమీషన్ చైర్మన్ ను కోరారు.

ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాలన్నది బిజెపి విధానమే! అయితే అది ఒక రాజకీయ అస్త్రంకూడా! హిందూత్వం ఎన్నికల్లో ఉపయోగపడే అవకాశాలున్నపుడే దీన్ని బయటకు తీస్తూ వుంటారు. ఈ సారి సందర్భం తొమ్మిది నెలల్లో జరగబోతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలే ఈ సారి సందర్భం!
భారత వివాహ చట్టాలలో బహుభార్వాత్వానికి వీలు లేదు, ఏకపక్ష విడాకులకు అవకాశంలేదు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం పురుషులు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు మూడు సార్లు తలాక్ అని చెప్పడం ద్వారా భార్య, భార్యలతో చెప్పాపెట్టకుండానే వారికి విడాకులు ఇవ్వవచ్చు. కామన్ సివిల్ కోడ్ వర్తింపజేస్తే ఈ ఆచార వ్యవహారాలు సాగవు.

ముస్లిం మహిళలు తమ వ్యక్తిగత, సాంఘిక, ఆర్ధిక భద్రతలకోసం కోర్టులకు ఎక్కుతున్నారు. ఆరేబియా దేశాల్లోకూడా మహిళల విషయంలో ముస్లిం చట్టాలను రద్దు చేసి వారి హక్కులను కాపాడుతున్నాయి.

భారత్‌లాంటి భిన్న మతాలు, సంస్కృతులున్న దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు సాధ్యం కాదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వంటివారు వ్యతిరేకిస్తూనే వున్నారు..దేశంలో ప్రస్తుతం నేర శిక్షాస్మృతి తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలతో పాటు హిందు వివాహ చట్టం, షరియత్‌కు సంబంధించిన ముస్లిం పర్సనల్‌లా అమల్లో ఉన్నాయి. ముస్లింలు చాలాకాలంగా ఉమ్మడి పౌరస్మృతి అమలును గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయటం అంటే తమ విశ్వాసాలను దెబ్బతీయటమే అన్నది వారి వాదన.

ప్రధానిగా వాజపేయి హయాంలోనూ బిజెపి ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టిపెట్టినా, అమలుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దేశ ప్రజలందరికీ ఒకే చట్టం అమలుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని గతంలో సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించటం తెలిసిందే. కొందరు ముస్లిం మహిళలు తమ భర్తల ఏకపక్ష విడాకుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తలుపులు తట్టినప్పుడు న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

వాజ్ పాయ్ హయాంలో జరగనిది మోదీ హయాంలో కదిలింది. లా కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలన్నది బిజెపి యోచన.

ఉమ్మడి పౌర స్మృతి అమలుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రజలందరికి ఒకే చట్టాన్ని అమలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధం కావటాన్ని స్వాగతిస్తానని కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి మహేష్ శర్మ చెప్పారు. సిపిఐ కార్యదర్శి డి రాజా కూడా ఉమ్మడి పౌరస్మృతి పట్ల సానుకూలంగా స్పందించారు. దేశంలోని మహిళల హక్కులను పరిరక్షించాల్సి ఉందంటూ, లా కమిషన్ ఏంచెబుతుందనేది చూసిన తరువాత పూర్తిస్థాయి ప్రతిస్పందన ఇవ్వటం మంచిదని అన్నారు.

ఈ కదలిక వెనుక బిజెపి ముందడుగుకంటే, మోదీ చొరవకంటే, ముస్లిం మహిళలలో వచ్చిన చైతన్యమే ఎక్కువగా కనబడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close