బూజు దుల‌ప‌రా… శంక‌రా

కొన్ని సినిమాల జాత‌క ప్ర‌భావ‌మో ఏమో.. ఎన్నాళ్ల‌కైనా బ‌య‌ట‌కు రావు! సినిమా పూర్త‌యి విడుద‌ల తేదీలు మార‌డం త‌ప్ప దోషం పోదు.. గ్ర‌హ‌ణం వీడ‌దు. అలా ఎన్నోసార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఏమిటో ఈమాయ చిత్రం రాజాధిరాజాగా విడుద‌లైంది. ఇప్పుడు అలాంటి పురాత‌న చిత్ర‌మే మ‌రోటి బ‌య‌ట‌కు వ‌స్తోంది. అదే శంక‌ర‌. నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. రెజీనా క‌థానాయిక‌. త‌మిళ చిత్రం మాన్ క‌రాటే చిత్రానికి ఇది రీమేక్‌. స‌త్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమా పూర్త‌యి రెండేళ్లు దాటేసింది. అయినా మోక్షం దొర‌క‌లేదు. నాలుగైదు సార్లు విడుద‌ల ముంగిట వ‌ర‌కూ వ‌చ్చింది. కానీ… అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డ‌డం అల‌వాటుగా మార్చుకొంది.

ఇప్పుడు మ‌రోసారి శంక‌ర సినిమాని బ‌య‌ట‌కు తీయ‌నున్నారు. ఈ సినిమాని ఈ సీజ‌న్‌లో ఎలాగైనా రిలీజ్ చేయాల‌ని నిర్మాత కె.ఎస్‌.రామారావు కంక‌ణం క‌ట్టుకొన్నార్ట‌. ట్రైల‌ర్‌ని కొత్త‌గా క‌ట్ చేసి, ప్ర‌మోష‌న్ భారీగా చేసి ఈ సినిమాని బ‌య‌ట‌కు పంపేయాల‌ని చూస్తున్నారు. ఈ సినిమా విడుద‌లైతే. క‌నీసం శాటిలైట్ రూపంలో అయినా నాలుగు డ‌బ్బులు వెన‌కేసుకోవ‌చ్చ‌న్న‌ది నిర్మాత ఉద్దేశం. మ‌రి ఇప్ప‌టికైనా ఆ శంక‌రుడి ఈ శంక‌ర పై ద‌య చూపిస్తాడో, లేదో.??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

రైతు భరోసా స్టార్ట్ … క్రెడిట్ బీఆర్ఎస్ దేనా..?

రైతు భరోసాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కేసీఆర్ తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల వేళ పెట్టుబడి కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతుండటంతో ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారు....

ఓటేస్తున్నారా ? : కష్టాల్లో నేనున్నానని భరోసా ఇచ్చే పాలకుడెవరో ఆలోచించండి !

ఓ డ్యామ్ పగిలిపోయింది.. కొట్టుకుపోయింది. డ్యామ్ అంటే చిన్న విషయం కాదు. ఆ డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయిందన్న సంగతి తర్వాత ముందుపాలకుడు ఏం చేయాలి ?. ఉన్న పళంగా అక్కడికి వెళ్లి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close