మన ఆర్థిక సంవత్సరం మారనుందా?

భారత దేశ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న మొదలవుతుంది. మార్చి 31న ముగుస్తుంది. దీన్ని మార్చడం అవసరమా, మారిస్తే ఉపయోగాలు ఏమిటో అధ్యయనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని అంశాలూ పరిశీలించి డిసెంబలర్ 31న ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.

ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సంవత్సరం మొదలైతే మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తడం కష్టమవుతుందని ఇటీవల కొందరు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. కొత్తగా చేసిన కేటాయింపులు ఆయాన నిర్మాణాల పనుల కోసం చేరేసరికి మే లేదా జూన్ వస్తుందని అప్పుడు నాలుగు నెలలు వర్షాకాలంలో పనులకు ఆటంకం కలుగుతుందని వారి అభిప్రాయం. అలా కాకుండా ఆర్థిక సంవత్సరాన్ని మారిస్తే నిధుల వ్యయానికి ఆటంకం ఉండదని, కాబట్టి మార్కెట్లో ద్రవ్య చెలామణి జోరు తగ్గకుంగా కొనసాగుతుందని కొందరు సలహా ఇచ్చారు.

అయితే దీని సాధ్యాసాధ్యాలు, మార్పు వల్ల ఉపయోగాలు, నష్టాలను అధ్యయనం చేయడానికి మోడీ ప్రభుత్వం కమిటీని నియమించింది. దాని నివేదిక వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో ఏయే దేశాల్లో ఎప్పుడు ఆర్థిక సంవత్సరం మొదలవుతుందో చూద్దాం…

అమెరికా- అక్టోబర్ 1. ఇంగ్లండ్-ఏప్రిల్ 1. థాయ్ లాండ్- అక్టోబర్ 1. దక్షిణ కొరియా, స్పెయిన్- జనవరి 1. దక్షిణాఫ్రికా- ఏప్రిల్ 1. సింగపూర్, జపాన్- ఏప్రిల్ 1. ఆస్ట్రేలియా- జులై 1. బ్రెజిల్- జనవరి 1. చైనా- జనవరి 1. పాకిస్తాన్-జులై 1. రష్యా- జనవరి 1.

ఒకేసారి స్వాతంత్ర్యం పొందిన భారత్, పాకిస్తాన్ భిన్నమైన తేదీలను ఆర్థిక సంవత్సర ఆరంభ తేదీలుగా పరిగణస్తున్నాయి. చాలా దేశాలు క్యాలెండర్ సంవత్సరాన్నే ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తున్నాయి. అంటే జనవరి 1న అక్కడ ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఇంగ్లండ్ నుంచి స్వాతంత్ర్య పొందిన మనం ఆ దేశాన్నే అనుసరిస్తూ ఏప్రిల్ 1ని ఖరారు చేసుకున్నాం

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close