సంజయ్‌దత్ ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకొంటున్నాడు. ‘డబుల్ ఇస్మార్ట్’ లో విలన్‌గా కనిపించిన సంజూ.. ఆ తరవాత ‘రాజాసాబ్’లోనూ ఛాన్స్ అందుకొన్నాడు. ‘అఖండ 2’లో ఆయన ప్రతినాయకుడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఓ మెగా సినిమాలోనూ విలన్‌గా సెలక్ట్ అయ్యాడు.
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్రంలో విలన్‌గా సంజయ్‌దత్‌ని ఎంచుకొన్నారని తెలుస్తోంది. ఇటీవల చిత్రబృందం ఆయన్ని కలిసింది. దర్శకుడు కథ చెప్పాడు. నిర్మాత మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడు. దాంతో సంజూ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చేశాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ఫైట్ తెరకెక్కిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఈ ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. సంజూ త్వరలోనే సెట్స్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు చిత్రబృందం చెబుతోంది. ఇటీవల ఓ గ్లింప్స్ బయటకు వదిలారు. దాని కోసం ఏకంగా రూ.2కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు టాక్.