బాలీవుడ్ సినిమా గేమ్ చేంజర్స్ అనదగ్గ దర్శకుల్లో అనురాగ్ కశ్యప్ ఒకరు. కొన్ని సంచలనాత్మక సినిమాలు తీశాడు. గ్యాంగ్స్ అఫ్ వాసేపూర్ లాంటి కల్ట్ సినిమా ఆయన ఖాతాలో వుంది. అయితే గత కొనాళ్ళుగా ఆయన నుంచి సినిమాలు తగ్గాయి. నటనపై ద్రుష్టిపెతాడు. విజయ్ సేతుపతి మహారాజాలో అనురాగ్ నటన ప్రత్యేకం. ఆ క్లైమాక్స్ అంతలా పండటానికి అనురాగ్ మార్క్ కూడా వుంది. ఇటివలే మలయాళంలో రైఫిల్ క్లబ్ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర చేశాడు.
ఇప్పుడు తెలుగులో అడుగుపెడుతున్నాడు అనురాగ్. అడివి శేష్ డకాయిట్ సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఆయన నేరుగా చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. బాలీవుడ్ సినిమా పరిచయం వున్న వారికి అనురాగ్ ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఓ క్యారెక్టర్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అందులో విషయం వుంటుదనే నమ్మకం. మరి తెలుగు ఆడియన్స్ అనురాగ్ లోని విలక్షణ నటుడిని ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.