రామ్ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సెప్టెంబరు 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ప్రస్తుతం చిత్రబృందం టైటిళ్ల వేటలో పడింది. రామ్ ఎనర్జీకీ, కథకీ సరిపడ టైటిల్ కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది. ‘హైపర్’ అనే టైటిల్‌కి దాదాపు చిత్రబృందం అంతా ఓటేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ పాత్ర మరీ హైపర్ గా ఉంటుందట. అందుకే ఆ పేరైతేనే బాగుంటుందన్నది దర్శకుడి అభిప్రాయం. రామ్ కి కూడా… హైపర్ పైనే మనసు లాగుతోందని టాక్.
హైపర్ అనే టైటిల్‌ని 14 రీల్స్ ఇటీవలే ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించింది. దాంతో…. ఈ పేరు దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. ఈ యేడాది నేను శైలజతో హిట్టు కొట్టిన రామ్.. మరో్సారి మాస్ బాటలో వెళ్లి చేస్తున్న సినిమా ఇది. రభస తరవాత కాస్త సైలెంట్ గా మారిపోయిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాతో ఎలాగైనా నిరూపించుకోవాలని తపిస్తున్నాడు. మరి హైపర్తో.. హిట్టు కొడతాడేమో చూడాలి.