కొత్త సినిమా రిలీజ్ అంటే శుక్రవారమే. అయితే కొన్నిసార్లు గురవారం వదులుతుంటారు. పండగ లాంటి సీజన్స్ లో ఇది వర్క్ అవుట్ అవుతుంది. కానీ చాలా వరకూ ప్రతికూల ఫలితమే ఇస్తుంది. ఈ రోజు ఓదెల 2 కూడా లానే వచ్చింది. రెండో ఆటకే నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టేశారు. నిజానికి ఈ సినిమా చుట్టూ మంచి బజ్ వుంది. కానీ ఫుట్ ఫాల్స్ కనిపించలేదు. ఇదే అంశంపై ఈ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు గురువారం. సహజంగానే జనం రాక తక్కువ. రేపటి నుంచి ఇక సునామీనే అంటూ పంచ్ డైలాగ్ కూడా కొట్టేశారు సంపత్ నంది.
తమన్నా లీడ్ రోల్ లో చేసిన సినిమా ఇది. మంచి బజ్ తో వచ్చిన ఈ సినిమాకి కాస్త నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. పెద్దగా కొత్తదనం లేని కథ కథనాలు సరిగ్గా ఆకట్టుకోలేదని విమర్శకులు పెదవి విరిచారు. దీంతో పాటు అనుకున్న ఫుట్ ఫాల్స్ కూడా లేవు. ఇవన్నీ కూడా నిర్మాతలని కాస్త ఇబ్బంది పెట్టాయి. అయితే ఈ రోజు ప్రిమియర్ లా చూడాలని అసలైన రిలీజ్ రేపేనని ముక్తాయించారు మేకర్స్. ఏదేమైనా టాక్ జనాల్లోకి వెళ్ళిపోయింది. రేపు వస్తున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి కి పాజిటివ్ టాక్ వస్తే.. ఓదెల 2కి గురువారం రిలీజ్ ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుందని చెప్పాలి.