ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయగా… మరోవైపు ఆర్ఆర్ఆర్ ను టార్చర్ చేసిన కేసుతోపాటు జత్వాని కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. నటి జత్వాని కేసుతో సస్పెన్షన్ లోనున్న ఆయన జగన్ కోసం పని చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన అరెస్ట్ ను జగన్ రెడ్డి ఖండించడం ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్టు అవుతోంది.
లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి సిట్ అధికారుల కళ్ళను తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లడం, తదుపరి సిట్ విచారణకు హాజరయితే ఎలా వ్యవహరించాలి అనే గైడెన్స్ పీఎస్ఆర్ ఇచ్చారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కేసును ఆయన స్పెషల్ గా మానిటరింగ్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తుండగా.. జత్వాని , ఆర్ఆర్ఆర్ ను టార్చర్ చేసిన కేసులో పీఎస్ఆర్ ను అదుపులోకి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది .
తనకు ఎదురైన వేధింపులపై 2024 ఆగస్టు 30న ముంబై నటి జత్వాని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారుల నివేదిక ఆధారంగా గత సెప్టెంబర్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. అందులో పీఎస్ఆర్ ఉన్నారు. సస్పెన్షన్ తర్వాత ఆయన చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. సీనియర్ ఐపీఎస్ అధికారిగా కొనసాగుతూ వైసీపీ కార్యకర్తగా బిహేవ్ చేసిన పీఎస్ఆర్ పై సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోలేదు.
దీంతో.. పగ పెంచుకున్నారో ఏమో , అప్పటి నుంచి జగన్ కు వ్యూహాలు రచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులోనూ రాజ్ కసిరెడ్డికి, వైసీపీకి పూర్తిస్థాయి స్ట్రాటజిస్ట్ గా మారారని ప్రచారం జరుగుతొన్న తరుణంలో ఆయన అరెస్ట్ కావడం..ఆ అరెస్ట్ ను జగన్ ఖండించడం చూస్తుంటే ఈ ప్రచారం నిజమేనని అనిపిస్తోందని అంటున్నారు.