అధికారంలో ఉన్నప్పుడు అమరావతిపై విషం చిమ్మిన జగన్ కు పశ్చాతాపం ప్రకటించే అవకాశం వచ్చింది. బేషరతుగా మద్దతు ప్రకటించకుండానే అమరావతికి జైకొట్టే ఛాన్స్ ఉంది. దీంతో రాజధాని విషయంలో జగన్ లాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆ పార్టీ భావితన్యాన్ని ఖరారు చేయనుంది.
మూడు రాజధానులు అని పనికిమాలిన నిర్ణయం తీసుకొని పార్టీ భవితవ్యాన్ని ప్రశ్నార్ధకం చేసుకున్నారు జగన్. మూడు రాజధానుల నిర్ణయం ఎంతటి తప్పుడు నిర్ణయమో జగన్ కూ గతేడాది ఎన్నికలు తెలిసివచ్చేలా చేశాయి. కానీ, ఇప్పుడు ఆ నిర్ణయం పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తే పార్టీకి మనుగడ ఉండొచ్చు. అంతేకాని, తెగేదాక లాగితే గడ్డు పరిస్థితులు తప్పవు. ఎందుకంటే అమరావతి మరో మూడేళ్లలో నిర్మాణం పూర్తి కానుంది. అడ్డుకునేందుకు జగన్ కు ఎలాంటి అవకాశం లేదు.
ఆలస్యమైనా అమరావతికి జైకొడితే జనం వైసీపీ పట్ల కొంత సానుభూతి చూపే అవకాశాన్ని కొట్టిపారేయలేం.రాజధాని రీలాంచ్ పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ శుక్రవారం అమరావతి వస్తున్నారు. ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజధాని అంశం కావడంతో అన్ని పార్టీలను ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ఇన్వైట్ చేస్తోంది. జగన్ ను కూడా గతంలోలాగే ఆహ్వానించింది. స్వయంగా ఆయన ఇంటికి ప్రోటోకాల్ అధికారి ఫజల్ వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చారు.
ఆయన వస్తారా లేదా అనేది పక్కన బెడితే రాకపోతే మాత్రం వైసీపీ ఇంకా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నట్టేనని సంకేతాలు వెళ్తాయి. అది వైసీపీకి మరింత ప్రమాదం. రాజకీయ భవిష్యత్ ను ఏమాత్రం అంచనా వేసి ఈ సభకు జగన్ వెళ్లడం ఆ పార్టీ ప్రయోజనాలకు మంచిది. పంతానికి వెళ్తే మాత్రం అమరావతి చరిత్రపుటలో వైసీపీకి విలన్ క్యారెక్టర్ పదిలంగా ఉంటుంది.