జనగణనతోపాటు అధికారికంగా కుల గణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు కేసీఆర్ వైఖరి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్త కులగణనకు ఆయన మద్దతు ఇస్తారా?ఇవ్వరా అనేది రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్రం కుల గణన చేపడితే ఎంతటి వారైనా కులం వివరాలు చెప్పాల్సిందే. అది నిబంధన. లేదంటే జనాభా లెక్కలో ఉండకుండా పోతారు. తెలంగాణ సర్కార్ చేపట్టిన కుల గణనకు వివరాలు చెప్పకుండా దాటవేసింది కేసీఆర్ ఫ్యామిలీ. కేటీఆర్ , హరీష్ రావు కూడా అదే పని చేశారు. ఒక్క కవిత మాత్రమే తమ కుటుంబ వివరాలను సమర్పించారు.
ఇప్పుడు మోడీ చేసే కుల గణన విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కులగణనలో పాల్గొంటే రేవంత్ చేపట్టిన కులగణనకు దూరంగా ఉండి, మోడీ ప్రభుత్వానికి తలోగ్గారనే వాదనలు వినిపిస్తాయి. అప్పుడు కాంగ్రెస్ మరోసారి బీఆర్ఎస్ – బీజేపీ ఒకటేనని ప్రచారాన్ని మళ్లీ వాడుకలో ఉంచుతుంది.
దీంతో మోడీ చేపట్టనున్న కుల గణన విషయంలో కేసీఆర్ కాంగ్రెస్ కు దొరక్కుండా ఎలా ఉంటారో చూడాలి.