ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాగా హర్టైనట్టు ఉన్నారు. వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రపంచం ముంగిట పెట్టి తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారని ప్రెస్ మీట్ లో ప్రశ్నించిన కేటీఆర్..సీఎం రేవంత్ రెడ్డికి కీలక సూచనలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీపై ఎన్ని విమర్శలు చేసినా భరిస్తామని , తెలంగాణ అప్పుల పాలైందని అంటే ఎవరూ భరించరని చెప్పుకొచ్చారు. ఇది సరైంది కాదని, అలా చెప్పడం వలన తెలంగాణ ఆర్థిక పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుందన్నారు. కుటుంబ పెద్దగా ఎన్ని సమస్యలు ఉన్నా, వాటిని భరిస్తూ అభివృద్ధిని కొనసాగించేలా ముందుకు వెళ్లాలే కానీ అప్పులు ఉన్నాయని, అప్పులు పుట్టడం లేదని బహిరంగంగా ప్రకటించవద్దని సూచించారు కేటీఆర్.
తెలంగాణ అప్పులపాలైందని అంటున్న రేవంత్ రెడ్డి..ఆయన కుటుంబ ఆదాయం ఎలా పెరిగిందో చెప్పాలన్నారు కేటీఆర్. అదే సమయంలో కొన్ని సూచనలు చేశారు. అప్పు పుట్టడం లేదనే వ్యాఖ్యలను పదేపదే ప్రస్తావించవద్దని చెప్పారు. ఇది తెలంగాణ అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుందని చెప్పుకొచ్చారు.
నిజానికి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల సమావేశంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది వివరించారు. అప్పు పుటడం లేదని , కొత్తగా ఏమైనా చేద్దామన్న కుదరడం లేదని వాపోయారు. దీనిపై ప్రెస్ మీట్ నిర్వహించిన కేటీఆర్.. రేవంత్ పై విమర్శలు చేస్తూనే.. వాస్తవ పరిస్థితిని బయటపెడితే ఎలా అంటూ విలువైన సూచనలు చేశారు. వాటిని రేవంత్ స్వీకరిస్తారో.. లేదో చూడాలి.