పాక్ పై యుద్దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? కేంద్రం డేట్ కూడా ఫిక్స్ చేసిందా? అంటే జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
పహల్గం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోడీ.. ఆ దిశగా త్రివిధ దళాలతో వరుసగా సమావేశం అవుతున్నారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో 48గంటల్లోనే వరుసగా రెండుసార్లు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.
అత్యవసర సమయాల్లో పౌరులు ఎలా స్పందించాలనే దానిపై అవగాహన కల్పించి, వారిని అలర్ట్ చేసేందుకు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఈ కసరత్తు జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇలా వరుసగా యుద్ద సన్నాహాలు కేంద్రం మొదలు పెట్టడంతో పాక్ పై ప్రతీకారం తప్పదనే వాదనకు మరింత బలం చేకూర్చినట్లు అవుతోంది. అయితే, 1971లో మాక్ డ్రిల్ యుద్దానికి సరిగ్గా రెండు నుంచి నాలుగు రోజుల ముందు మొదలు పెట్టారని ఓ సీనియర్ జర్నలిస్ట్ చెప్పడంతో..ఇప్పుడు కూడా ఈ మాక్ డ్రిల్స్ ముగిసిన తర్వాత పాక్ ఉగ్రస్తావరాలపై దాడి జరిగే అవకాశం ఉంది. అంటే వచ్చే వారం ఏ క్షణమైనా పాక్ పై యుద్ధం ఖాయమని ప్రచారం జరుగుతోంది.