ఉండవల్లి అరుణ్ కుమార్.. జగన్ ఇచ్చిన టాస్క్ కు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జైల్లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులకు మద్దతుగా మాట్లాడేందుకు ముందుకు వస్తున్నారు. ఆయనకు వైసీపీ సపోర్టు చేయలేని పరిస్థితిలో ఉంది. నిజంగా సపోర్టు చేస్తే ఆయన వైపీఎస్గా పని చేశారని అందరికీ క్లారిటీ వస్తుంది. అది ఆయనకు మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించడం చేయలేదు. ఆయన తప్పు చేయలేదని ఎవరూ వాదించడం లేదు.
అయితే అసలు గాలికి వదిలేసినట్లుగా ఉండకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఈ టాస్క్ ఇచ్చారు. ఆయన పీఎస్ఆర్ తో ఓ సారి ములాఖత్ అయి ఆ విషయాలు మీడియాకు చెప్పారు. పనిలో పనిగా ఇంకా కేసులు పెడతారని.. ఇప్పుడల్లా బయటకు రానివ్వరని పీఎస్ఆర్ చెప్పారని చెప్పుకొచ్చారు. చాలా చెబుతున్న ఉండవల్లి పీఎస్ఆర్ ఆంజనేయులు తప్పు చేయలేదని మాత్రం చెప్పడం లేదు. డీజీ ర్యాంక్ లో అరెస్టు అయిన మొదటి అధికారి అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కానీ తన డీజీ ర్యాంక్ ను ఆయన దుర్వినియోగం చేసినట్లుగా ఎవరూ చేయలేదేమో?
రాజకీయ కక్షసాధింపులు ఒకటి అయితే.. మాఫియా మాదిరిగా పోలీసుల్ని ఉపయోగించుకోవడం ఇంకోటి. చంద్రబాబు, టీడీపీ నేతలపై రాళ్ల దాడుల వెనుక పీఎస్ఆర్ వ్యూహం ఉంది. చంద్రబాబుపై తప్పుడు కేసులు, సాక్ష్యాల సృష్టి వెనుక ఆయన హస్తం ఉందనేది బహిరంగ రహస్యం.చేసిన తప్పులు చాలక.. తాను చెప్పిన పనులు చేసిన వారిని బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పీఎస్ఆర్ తప్పు చేయలేదని వైసీపీ లో ఒక్కరు కూడా చెప్పడం లేదు.. ఉండవల్లి కూడా చెప్పడం లేదు. కానీ ఆయనను జైల్లో పెట్టారని తెగ బాధపడిపోతున్నారు. జగన్ లాంటి వారిని నమ్ముకుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయో పీఎస్ఆర్ లాంటి వారిని చూసి.. అందరూ తెలుసుకోవాల్సి ఉంటుంది.