గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష పడటంపై తాడేపల్లి ప్యాలెస్ లేదా బెంగళూరు ప్యాలెస్ లో ఎలాంటి వాతావరణం క్రియేట్ చేసి ఉంటుందని చెప్పడం కష్టం. గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తనకు తెలియదని గతంలో జగన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఎవరో అనామకుడు.. గనులు దోచేసుకుని జైలుకెళ్లాడని..అనుకున్నట్లుగా కనిపించాలని జగన్ రెడ్డితో పాటు ఆయన బ్యాచ్ సైలెంటుగా ఉన్నారు. వైసీపీ మీడియాలోనూ ఆ వార్తకు ప్రాధాన్యం ఇవ్వలేదు.
జైలు భయంతో పాదయాత్ర ప్రకటన
నిజానికి ఆ తీర్పు ఇచ్చిన ప్రకంపనలు తాడేపల్లిలో గట్టిగానే తగిలాయి. అందుకే 2027లో పాదయాత్ర చేస్తా అంటూ హడావుడిగా సమావేశం పెట్టి ప్రకటించారు. తర్వాత ఎప్పుడైనా తీర్పులు వస్తే తాను ప్రజల్లోకి వస్తానని చెప్పి, పాదయాత్ర చేస్తానన్న భయంతో కుట్రలు చేసి జైల్లో పెట్టించారని చెప్పుకోవడానికి ఇప్పుడే పునాది వేసుకున్నారన్న మాట. జగన్ రెడ్డి శవాలతో రాజకీయం చేయాలని తండ్రి చనిపోయిన రోజే ఎలా ప్లాన్ చేసుకున్నారో గుర్తు చేసుకుంటే.. ఆయన తర్వాత జరగబోయే రాజకీయాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.
న్యాయవ్యవస్థను ఎప్పుడూ గౌరవించని లీడర్
న్యాయవ్యవస్థపై ఎవరికైనా అత్యున్నత నమ్మకం ఉంటుంది. ఉండాలి కూడా. కానీ జగన్ రెడ్డి మాత్రం న్యాయవ్యవస్థతో మొదటి నుంచి ఆడుకుంటున్నారు. ఎంతగా ఉంటే కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద తప్పుడు ఆరోపణలతో లేఖలు రాయడం దగ్గర నుంచి వారి కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు పెట్టడం వరకూ చాలా చేశారు. ఆ స్థాయి జడ్జిపైనే అలా చేస్తే ఇక కింది స్థాయి వారిని వదులుతారా?. సోషల్ మీడియాలో నరికేస్తాం అనే బెదిరింపుల వరకూ అన్నీ చేశారు. ఆ వ్యవస్థపై జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు బయటకు తెలిసింది చాలా తక్కువ. వ్యవస్థలో ఉన్న వారికి తెలిసిందే ఎక్కువ.
ఎప్పటికైనా శిక్ష తప్పదు – అదే చరిత్ర చెప్పిన సత్యం
రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వ్యవస్థల్ని కంట్రోల్ చేయవచ్చని అనుకుంటే అంతకు మించిన తప్పిదం మరొకటి ఉండదు. కానీ ఆ తప్పును జగన్ రెడ్డి చేసేశాడు. ఏదో చేయాలనుకున్నాడు. ఓ క్రిమినల్ తమతో ఆడుకుంటే.. న్యాయవ్యవస్థ మాత్రం చూస్తూ ఊరుకుంటుందా?. చట్టం, న్యాయం ప్రకారమే కొరడా ఝుళిపిస్తుంది . ఆ సమయం దగ్గరకు వస్తోంది. జగన్ రెడ్డికీ అర్థమయింది. అందుకే మళ్లీ తనదైన బురద రాజకీయాలు ప్రారంభించారు.