ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరావతి పునర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి వెళ్లారు. సాధారణంగా శంకుస్థాపన చేసిన తర్వాత పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పడం కష్టం. శంకుస్థాపన రాళ్లు అలాగే ఉండిపోయిన ప్రాజెక్టులు ప్రతి ఊళ్లో కనిపిస్తాయి. అందుకే చాలా మందికి అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయా అనే సందేహం ప్రారంభమయింది.
అమరావతిలో పనులు ఎప్పుడో ప్రారంభమయ్యాయి. కాంట్రాక్ట్ పొందిన సంస్థలు తన సన్నాహాలను అప్పటికే పూర్తి చేశాయి. గ్రౌండ్ క్లియరింగ్ చేసుకున్నాయి. నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించుకున్నాయి. ప్రధాని మోదీ లాంఛన ప్రారంభోత్సవం కోసమే ఆగాయి . అదే రోజు నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అమరాతిలో పలు చోట్ల.. నిర్మాణ కార్మికులే ఎక్కువగా కనిపిస్తున్నారు. బడా బడా కాంట్రాక్ట్ కంపెనీలు పూర్తి స్థాయిలో యంత్రాలను తీసుకు వస్తున్నాయి. గతంలో నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలు ఇప్పుడు పనులతో కళకళలాడుతున్నాయి.
ఐకానిక్ భవనాల డిజైన్ల విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాటికీ కాంట్రాక్టర్లు ఖరారు అయ్యారు. ఆ నిర్మాణాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక ప్రైవేటు సంస్థలు కూడా తన నిర్మాణాలను ప్రారంభించబోతున్నాయి. ఎలా చూసినా అమరావతిలో ఇప్పుడు నిర్మాణ శోభ కనిపిస్తోంది. ప్రతి నెలా విజుబుల్ డెలవప్మెంట్ ప్రజల ముందు ఉండనుంది.