కేఏ పాల్ టర్కీకి వెళ్లేందుకు బ యలుదేరారు. టిక్కెట్ కొనుక్కుని ఆయన ముంబై నుంచి ఇస్తాంబుల్ వెళ్లే విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లారు. కానీ అక్కడ ఆయనను అనుమతించలేదు. ఆయనతో పాటు మరో ముగ్గుర్ని అనుమతించలేదు. దీంతో పాల్ ఎయిర్ పోర్టులో రచ్చ రచ్చ చేశారు. తాను టిక్కెట్ కొనుక్కున్నా అనుమతించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాల్ ఎందుకు ఆపారో ఇండిగో ప్రకటించలేదు. టిక్కెట్ కొనుక్కుంటే సరిపోదని.. వీసా కూడా ఉండాలని కొంత మంది చెబుతున్నారు . కే ఏ పాల్ కు అమెరికన్ గ్రీన్ కార్డు ఉంది. ఈ పాస్ పోర్టు మీద చాలా దేశాలకు ఆయన వీసా లేకుండా వెళ్లవచ్చు. కానీ ఆయా దేశాల నుంచి అప్రూవల్ ఉండాలి. అదే సమయంలో అసలు ఆయన టర్కీకి ఎందుకు వెళ్తున్నారో తెలియదు కానీ.. ఇండిగో కౌంటర్ నుంచి వీడియో తీసి..తాను శాంతి చర్చలకు వెళ్తూంటే ఆపేశారని ఆరోపించారు.
టర్కీ పాకిస్తాన్ కు డ్రోన్లు సరఫరా చేస్తోంది. ఆ దేశంతో సంబంధాలు వీలైనంతగా తగ్గించుకోవాలని భారత్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆయన పర్యటన, యుద్ధం కారణంతో అని చెబుతూండటంతో అధికారులు ఆపేసి ఉంటారని భావిస్తున్నారు. కేఏ పాల్ ఇప్పుడు ఓ కమెడియన్ లా ప్రవర్తిస్తున్నారు కానీ.. ఒకప్పుడు ఆయనకు చాలా ప్రపంచదేశాల అధినేతతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే తన అలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఫ్లైట్లు ఎక్కించుకోనంత దీన స్థితికి పడిపోయారు.