పులివెందుల రైతుల కోసం కోటి పధ్నాలుగు లక్షల రూపాయలను జగన్ రెడ్డి పార్టీ నుంచి ఇచ్చారని వైసీపీ సోషల్ మీడియా గొప్పగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించింది. ఆ ప్రచారాన్ని చూసిని అందరూ జగన్ రెడ్డిని ఇలా ట్రోలింగ్ చేస్తారంటని సొంత పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. ఎంగిలి చేతిని విదిల్చి మెతుకులు రాలి పడితే .. అదే మా అన్న ఔదార్యం అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్న వారి తీరు చూసి జాలి పడని వారు లేరు.
జగన్ రెడ్డి ఇటీవల ఓ పెళ్లికి హాజరయ్యేందుకు పులివెందులకు వెళ్లారు. ఆ సమయంలో పెద్ద గాలి వాన వచ్చింది. ఈ కారణంగా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో అరటితోటలకు నష్టం జరిగింది. జగన్ రెడ్డికి తాను నియోజకవర్గంలో ఉన్నా కాబట్టి.. రైతుల్ని పరామర్శించకపోతే బాగోదని అనిపించిందో…అవినాష్ రెడ్డి ఒత్తిడి చేశాడో కానీ బెంగళూరు వెళ్లిపోవాల్సి ఉన్నప్పటికీ ఒక రాత్రి వాయిదా వేసుకుని తర్వాత రోజు ఉదయమే లింగాల మండలంలో పర్యటించారు. సహజంగానే ప్రభుత్వం ఏమీ చేయదన్న భావనలో ఉంటారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ చేయలేదని ఆయనకు తెలుసు. అందుకే ప్రజలు నమ్మరని.. పర్యటించడం వల్ల వారు ఎంతో కొంత ఆశిస్తారని అనుకున్నారు. అందుకే తాను కూడా ఎంతో కొంత సాయం చేస్తానని ప్రకటించి వెళ్లారు.
ఇది జరిగి రెండు నెలలకుపైగా అవుతోంది. రైతులు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దాంతో జగన్ రెడ్డికి ఇస్తానని చెప్పిన డబ్బులు ఇవ్వకతప్పలేదు. చివరికి హెక్టార్ కు ఇరవై వేలు ఇస్తామని ప్రకటించారు. ఇచ్చారా లేకపోతే ఇస్తారా అన్నది తెలియలేదు. ఎవరైనా ఎకరాల లెక్కల పరిహారం ఇస్తారు..జగన్ రెడ్డి మాత్రం హెక్టార్ కు ఇరవై వేలు ఉన్నారు. హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు. రెండున్నర ఎకరాలకు ఇరవై వేలు అంటే.. ఎకరానికి ఏడున్నర వేలు కూడా ఇవ్వనట్లే. అది కూడా ఒక్క మండలంలో రైతులకు మాత్రమే ఇచ్చారు.
ఈ మాత్రం ఇవ్వడానికి జగన్ రెడ్డి తప్పించుకోలేని పరిస్థితి రావడం ఓ కారణం అయితే.. పిల్లికి బిచ్చం పెట్టని జగన్ అనే ప్రచారం పులివెందుల మొత్తం జరుగుతూండటంతో ప్రజలు ఓట్లు వేయరన్న భావనతో ఈ నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించారు. తాము ఇచ్చిన అధికారంతో వైఎస్ కుటుంబం మొత్తం వేల కోట్లు సంపాదించుకుంటే తాము కష్టాల్లో ఉంటే… నాలుగైదు వేలు విదిలించడానికి ఎంత ఫీల్ అవుతున్నాడోనని పులివెందుల ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. దానవీరుశూరకర్ణుడేనని సెటైర్లు వేసుకుంటున్నారు.