వైఎస్ జగన్ అండ్ దోపిడీ గ్యాంగ్ పై అతి పెద్ద బాంబు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్ కసిరెడ్డి అప్రూవర్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన సిగ్నల్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాజ్ కసిరెడ్డి లాయర్.. పెద్దలందరూ తప్పించుకుని కసిరెడ్డిని బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టు ముందే ఆరోపించారు. ఆయన తన క్లయింట్ సమ్మతి లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయరు. అంటే.. రాజ్ కసిరెడ్డి..తనను అక్కడినే బలి పశువును చేయాలనుకుంటే సహించబోమని.. అన్నీ బయటపెడతానని సంకేతాలను పంపించారని అనుకోవచ్చు.
ఏ-1గా కసిరెడ్డి – జగన్ ను నమ్మడం లేదు !
లిక్కర్ స్కామ్ లో ఏ 1గా రాజ్ కసిరెడ్డి ఉన్నారు. అధికారం పోయిన తర్వాత హైదరాబాద్ లో ఉంటున్నారు. లిక్కర్ స్కాంలో దోచేసిన డబ్బులతో పెట్టిన పెట్టుబడులతో వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే ఆ క్యాంపులో ఎక్కడో తేడా వచ్చింది. అందుకే విజయసాయిరెడ్డి మొత్తం సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని చెప్పారు. జగన్ రెడ్డితో గొడవల కారణంగా ఆయన అలా చెప్పారని అనుకున్నారు. కానీ కసిరెడ్డిని బలి చేసి జగన్ ను కాపాడే ప్రయత్నమని ఆయనకు ఇప్పుడు అర్థమవుతోంది. ఎలాగోలా తనను కాపాడతారని అనుకున్నా..తనను బలి చేసేందుకు సిద్ధమవుతున్నారని క్లారిటీ రావడంతో ఆయన రగిలిపోతున్నారు.
బయటపడేందుకు ప్రయత్నిస్తున్న సూత్రధారులు
లిక్కర్ స్కాం చాలా పక్కాగా నడిచింది. సూత్రధారులు అంతిమ లాభం తమకు అందేలా చేసుకున్నారు కానీ.. కింది స్థాయిలో కొంచెం కొంచెం కమిషన్లు ఇచ్చి ఎకరాల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏపీబీసీఎల్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి. రాజ్ కసిరెడ్డి వంటివాళ్లు ఈ బకరాలు. మొత్తం వీరి పేర్లపై నిర్వహించారు కానీ..వీరికి కమిషన్ మాత్రమే ముట్టింది. అయితే రాజ్ కసిరెడ్డి మాత్రం మరింత ఎక్కువగా వెనకేసుకున్నాడని అంటున్నారు. ఇప్పుడు ఆయనను మొత్తం వ్యవహారంలో బలి చేసేసి..తాము బయటపడలేలా సూత్రధారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిపై రాజ్ కెసిరెడ్డికి స్పష్టమైన సమాచారం అందింది.
కసిరెడ్డి లాయర్ ఆరోపణలు ఓ హెచ్చరిక
కసిరెడ్డి లాయర్.. తన క్లయింట్ ను ఏ 1గా పెట్టి సూత్రధారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చేసిన ఆరోపణలు చిన్నవి కావు. ఆయన తన వ్యాఖ్యల ద్వారా రెండు వర్గాలకు సందేశారు. తనను మాత్రమే బలి చేయాలనుకుంటే.. మొత్తం బయట పెట్టేస్తానని జగన్ క్యాంపునకు సందేశం పంపించారు. అలాగే.. తాను అప్రూవర్ గా మారేందుకు కూడా రెడీనే అన్న సంకేతాలను సీఐడీకి పంపించారు. అంటే అసలు గేమ్ ఇప్పుడు ప్రారంభమవబోతోందన్నమాట.