ప్రధానమంత్రి నరేంద్రమోదీ హఠాత్తుగా అదంపూర్ లోని ఎయిర్ బేస్ కు వెళ్లారు. అక్కడ ఉన్న ఆర్మీ సిబ్బందితో సరదాగా గడిపారు. అక్కడ్నుంచి పాకిస్తాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇంత హఠాత్తుగా మోదీ పాకిస్తాన్ ..ఫైరింగ్ రేంజ్ కు దగ్గరగా ఉన్న ఎయిర్ బేస్ కు వెళ్లడం సంచలనం సృష్టించింది. అయితే పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి స్వయంగా కౌంటర్ ఇచ్చేందుకు మోదీ అక్కడికి వెళ్లారని అనుకోవచ్చు.
భారత్ సైనిక దళాల దెబ్బకు పాకిస్తాన్ కు జరిగిన నష్టం తక్కువ కాదు. పదకొండు ఎయిర్ బేస్ లను భారత్ ధ్వంసం చేసింది. ఆ ఫోటోలను కూడా సైనికాధికారులు విడుదల చేశారు. ప్రతిగా పాకిస్తాన్ తాము కూడా భారత్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేశారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయిన S400ను ధ్వంసం చేశామని ప్రచారం చేసుకుంటోంది. ఉదయం పూర్ ఎయిర్ బేస్ పై దాడితో అవి భారత్ కోల్పోయాయని చెప్పుకుంది. అయితే ప్రధాని మోదీ పర్యటనలో.. ఇవన్నీ స్ఫష్టంగా ఉన్నాయి.
మోదీ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ విమానం అదంపూర్ బేస్ లో చక్కగా దిగింది. మోదీ ప్రసంగించినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఎస్ 400 సిస్టమ్ ఉంది. అలాగే యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. ఆ ఎయిర్ బేస్ కు ఇసుమంత కూడా నష్టం జరగలేదని స్పష్టమయింది. అక్కడి నుంచే మోదీ పాకిస్తాన్ కు .. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చొరబడి కొడతామని హెచ్చరికలు జారీచేశారు. పాకిస్తాన్ ఫేక్ ప్రచారాలన్నింటినీ మోదీ ఇలా పరోక్షంగా తిప్పికొట్టారు. ఊహించని సర్జికల్ స్ట్రైక్ చేశారు.