హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆగ్రహం తెప్పించారు హయత్ నగర్ సీఐ. వివాదాస్పద భూముల విషయంపై బాధితులు ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదని సీరియస్ అయ్యారు. పోలీసులు ఉన్నది బాధితుల కోసమే కదా.. మరెందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నించారు.
కోహెడలో తమ ప్లాట్లను కబ్జా చేశారని బాధితులు ప్రజావాణిలో భాగంగా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రంగనాథ్ ను కలిసి వివరించారు. ఈ క్రమంలోనే ఆ వివాదాస్పద స్థలాన్ని బుధవారం రంగనాథ్ పరిశీలించారు.
అయితే , ఆ ల్యాండ్ లో మారణాయుధాలు ఉండటం చూసి రంగనాథ్ అవాక్కయ్యారు. మరోసారి విషయం పూర్తిగా తెలుసుకొని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై దాడి జరిగినా, మారణాయుధాలు ల్యాండ్ లో ఉన్నా ఎందుకు కేసులు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐని ప్రశ్నించారు. వెంటనే బాధితుల ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని ఆదేశించారు.