ఎక్కడ కొడితే జగన్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అక్కడే కొట్టాలని టీడీపీ ఫిక్స్ అయిందా? వై నాట్ కుప్పం అంటూ ప్రగల్భాలు పలికి వై నాట్ పులివెందుల అనే దీనస్థితికి జగన్ చేరుకుంటున్నారా? మహానాడుకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కడప గడపలో జరుగుతున్న రాజకీయం లెక్కేంటి?
జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. అవినీతి, అక్రమాలతోపాటు మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించారని తేలడంతో వైసీపీ నేత, కడప మేయర్ సురేశ్ బాబు పదవిని కోల్పోయారు. ప్రభుత్వ నిర్ణయంతో సురేశ్ బాబు ఎలా ఫీల్ అయ్యారో కానీ, జగన్ మాత్రం సొంత జిల్లాలో వైసీపీ కీలక పదవిని కోల్పోవడాన్ని ఆయన జీర్ణం చేసుకోలేకపోతుండోచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరో షాక్ తగిలింది.
పదవి మారింది.. లీడర్ మారారు..కానీ, జిల్లా మాత్రం అదే..జగన్ సొంత జిల్లా కడపలోనే మళ్లీ వైసీపీకి షాక్. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి గుడ్ బై చెప్పారు. కొంత కాలంగా వైసీపీతో అంటిముట్టినట్లుగా ఉంటున్న ఆయన..పార్టీ అధినేత వైఖరిపై విసిగి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేశారు.జగన్ తో మాట్లాడించాలని మాజీ ఎమ్మెల్యేను కోరినా ఆయన సహకరించకపోవడంతో ఇక చేసేదేం లేక రాజీనామాకు సిద్దపడ్డారు.
ఆయన టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉంది. అయితే , మహానాడు ముందు వైసీపీలో ఈ రాజీనామాలు ,వైసీపీ నేతల పదవులపై వేటుతో ఆ పార్టీలో మరిన్ని వికెట్లు పడుతాయా?అనే ఆందోళన కనిపిస్తోంది.