భారత ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్ సరిహద్దులోని అదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు. అక్కడి నుంచి పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మోదీని చూసి.. పాకిస్తాన్ ప్రధాని కూడా అలాగే వెళ్లాలనుకున్నాడు. వెళ్లాడు కూడా. ఆ వీడియోను రిలీజ్ చేశారు. కానీ ఆ వీడియోను చూసిన వారు పాకిస్తాన్ దుస్థితి ఇంత ఘోరంగా ఉందని చూసుకుని నవ్వుకుంటున్నారు.
పాకిస్తాన్ ప్రధాని వెళ్లిన ప్రాంతం ఎయిర్ బేసో.. ఆర్మీబేసో తెలియదు. ఎదో అడవుల్లో దాక్కున్న నక్సలైట్లను కలవడానికి వెళ్లినట్లుగా వెళ్లారు. ఆ బేస్ లో ఒక్క కట్టడం లేదు. గోనెపట్టాలు కట్టుకుని దాని కింద సైనికులు సేదదీరుతున్నారు. అక్కడికి వెళ్లడానికి పాక్ ప్రధాని ఉపయోగించి ఆర్మీ కార్లు కూడా తుప్పుపట్టిపోయి ఉన్నాయి. రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉంది.
పోని అక్కడ ప్రధాని సైనికులతో మాట్లాడటానికి ఓ వేదిక ఉందా అంటే అదీ లేదు. గడ్డితో కప్పేసిన యుద్ధట్యాంకు మీద నిల్చుని మాట్లాడారు. అంతకు మించి ఆ సైనికుల దగ్గర కూడా ఎలాంటి ఆయుధాలు కనిపించలేదు. భారత ప్రధాని అదంపూర్ కు ఎయిర్ ఫోర్స్ విమానంలో వెళ్లారు. అత్యాధునిక ఆయుధాలను చూపించారు. పాకిస్తాన్ ధ్వంసం చేశామని చెప్పుకున్న వాటిని చూపించారు. కానీ పాక్ ప్రధాని తమ దగ్గర రైఫిల్స్ ఉన్నాయని కూడా చూపించుకోలేకపోయారు.
పాక్ ప్రభుత్వం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పాక్ పరిస్థితిఘోరంగా ఉందని ఇప్పుడు సాక్ష్యాలతో సహా అర్థమయిందని సెటైర్లు వేస్తున్నారు.