సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది రిటైర్ అయ్యారు. ఆమెకు ఇంకా మూడు వారాల పదవి కాలం ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో రిటైర్ అయిపోయారు. గుజరాత్ కు చెందిన జస్టిస్ బేలా త్రివేది.. కింది స్థాయి న్యాయధికారి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకూ ఎదిగారు. ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పోలిస్తే ఆమె పేరు ఎక్కువగా మీడియాలో ప్రచారం అయ్యేది. దీనికి కారణం రాజకీయ నేతలకు సంబంధించిన కేసులన్నీ ఆమె బెంచ్ విచారించేది.
చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్టు చేసిన కేసు దగ్గర నుంచి బీహార్ లో లాలూ యాదవ్ కేసుల వరకూ జస్టిస్ బేలా త్రివేది బెంచ్ విచారణ జరుపుతూ వచ్చింది. చంద్రబాబు విషయంలో 17A వర్తింప చేయాలా వద్దా అన్న అంశంలో బెంచ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. ఇంకా పలు కేసుల్లో జస్టిస్ బేలా త్రివేది సంచలనాత్మక తీర్పులు ఇచ్చారు.
ఆమె ఇచ్చిన ఓ తీర్పు నచ్చక లాయర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా న్యాయవాదులు సంప్రదాయాలు రిటైరైనా న్యాయమూర్తులకు నిర్వహించే వీడ్కోలు సభను కూడా లాయర్లు నిర్వహించడానికి ఇష్టపడలేదు. లాయర్లు కోపగించుకుంటారని.. వారు చేసిన తప్పుల్ని ఆమె క్షమించాలని అనుకోలేదు. సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తులలో జస్టిస్ బేలా త్రివేది తనదైన ముద్ర వేశారు.