అది స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినప్పటి సందర్భం. చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే టీవీ చానల్స్ లో బ్రేకింగులు… ముఖ్యంగా టాప్ 2 చానల్స్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దర్యాప్తు సంస్థలు ఎక్కడా ఒక్క రూపాయి దారి తప్పాయని కానీ చంద్రబాబుకు కానీ టీడీపీ నేతలకు కానీ చేరాయని చిన్న ఆధారం చూపించలేదు. కానీ మూడు వందల కోట్ల నుంచి ప్రారంభించి మూడు వేల కోట్ల వరకూ చంద్రబాబు, టీడీపీ ఖాతాల్లోకి చేరిపోయాయని బ్రేకింగులు ఉదరగొట్టేశారు. అన్నీ నిర్దారణ అయినట్లుగా చెప్పేవారు.
చంద్రబాబు స్కాం అని.. స్కిల్ డెలవప్మెంట్ స్కాం అని …. వారి రిపోర్టింగ్ చూసి అబ్బో గొప్ప ప్రమాణాలు అనుకున్నారు అందరూ. ఇప్పుడు అదే టీవీ చానళ్లు కళ్ల ముందు కనిపించే లిక్కర్ స్కాంలో చేస్తున్న రిపోర్టింగ్ చూస్తే.. .ఇంత మార్పు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారు. సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానిస్తే ఆ చానళ్లు చెప్పడం లేదు. పైగా.. పద్దతిగా ఇలా అని సీఐడీ అధికారులు చెబుతున్నారు. మూడు వేల కోట్ల లిక్కర్ స్కామ్ అని సీఐడీ సిట్ చెబుతోంది. ఆధారాలు ఇంకా చూపించలేదు అన్నట్లుగా రిపోర్టు చేస్తున్నారు.
లిక్కర్ స్కాంలో వచ్చి నగదుతో.. మీడియా, సోషల్ మీడియాను అప్పటి ప్రభుత్వ పెద్దలు సజ్జల ద్వారా పోషించారు. కేవలం నగదు మాత్రమే పంపేవారు. ఆ నగదు అందుకున్న వారికి ఈ లిక్కర్ స్కాం ఎంత పెద్దతో తెలియదు. తమకు ఊహించనంత మొత్తం ఇచ్చారు కాబట్టి.. సంతృప్తి చెంది ఉంటారు. కానీ అప్పట్లో లేని స్కామ్లో తీర్పులు చెప్పేసి.. ఇప్పుడు పక్కాగా కనిపిస్తున్న.. పేద ప్రజల రక్తం పీల్చిన స్కామ్ విషయంలో ఎందుకు అంత నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు ? . ఈ రిపోర్టింగ్ వారి నైజాన్ని బట్టలిప్పదీసి ప్రేక్షకుల ముందు నిలబెడుతోంది.