మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు సిటీలో ఇళ్లు కొనాలని అనుకోవడం లేదు. ఆఫీసుకు చేరుకోవడానికి పది, ఇరవై కిలోమీటర్లు అయినా పర్వాలేదని అనుకుంటున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కారణం. అందుకే శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం జోరందుకుంటోంది. డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో ఒకటి గుండ్ల పోచంపల్లి.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో హైదరాబాద్కు సమీపంలో ఉన్న గుండ్ల పోచంపల్లి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఔటర్ రింగ్ రోడ్ , NH-44కి కనెక్టివిటీ ఉంది. సమీపంలో కొంపల్లి , మేడ్చల్లోని రైల్వే స్టేషన్లు ఉన్నాయి. నివాసితులు పెరుగుతూండటంతో గుండ్లపోచంపల్లిలో అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఓపెన్ ప్లాట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గుండ్లపోచంపల్లి 2018లో పురపాలక సంఘంగా ఏర్పడింది, దీని వల్ల రోడ్లు, వీధి లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థలలో మెరుగుపడింది.
ఈ ప్రాంతంలో 2BHK, 3BHK అపార్ట్మెంట్లతో పాటు గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అపార్టుమెంట్లలో చదరపు అడుగుకు రూ. 4,500 నుండి రూ. 6,500 వరకు ధరలు ఉన్నాయి. సౌకర్యాలను బట్టి ధర ఫైనల్ అవుతుంది. విల్లాల కోసం ఇక్కడ ఎక్కువ మంది ఎంక్వయిరీలు చే్తున్నారు. రు. 80 లక్షల నుండి రూ. 2 కోట్ల ధరల శ్రేణిలో విల్లాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్రాంతంలో ప్రాపర్టీల కొనుగోలుకు ఎన్నారైలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ధరలు పెరిగే అవకాశం ఉంది.