తప్పుడు పనులు చేసి జైలుకెళ్తున్న వైసీపీ నేతలకు రాబోయే రోజుల్లో తాము హోంమంత్రి అవుతామని చెప్పుకుంటున్నారు. కలలు కంటున్నారు. అమరావతిలో అరటి తోటలకు నిప్పు పెట్టి జగన్ కంట్లో పడి ఏకంగా ఎంపీ అయి ఇప్పుడు మాజీ అయిన నందిగం సురేష్ కు పోటీగా ఆయన భార్య వస్తున్నారు. ఈ సారి జగన్ .. సురేష్ కు కాకుండా.. ఆయన భార్య బేబీలతకు తాడికొండ టిక్కెట్ ఇస్తారని.. గెలిచాక హోంమంత్రిని చేస్తారని చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని వాళ్లే చెప్పుకుంటున్నారు.
నందిగం సురేష్ తో పాటు ఆయన భార్య ఓ టీడీపీ కార్యకర్తపై దాడిచేశారు. ఆయన కేసు పెట్టాడు. సురేష్ జైలుకెళ్లాడు. దీంతో ఆయన భార్య ఊహల్లోకి వెళ్లిపోయారు. అందరూ తనను కాబోయే హోంమంత్రిగా పిలుస్తున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో వైసీపీలో సైటైర్లు ప్రారంభమయ్యాయి. నందిగం సురేష్ కు ఆయన భార్య ఎర్త్ పెడుతున్నారని.. వీళ్లే ఇలా అనుకుంటే ఇక బోరుగడ్డ అని ఏమనుకోవాలని ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి కోసం బోరుగడ్డ అనిల్ ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడారు. చివరికి జైలు పాలయ్యారు. బయటకు రావడానికి తప్పుడు సర్టిఫికెట్లు పెట్టారు. ఇప్పటికీ బయటకు రాలేదు.
బోరుగడ్డ అనిల్.. ఆయన కుటుంబసభ్యులు కూడా.. జగన్ రెడ్డి కోసం జైలుకెళ్లిన తమకు..కాక హోంమంత్రి పదవి సురేష్ భార్యకు ఎందుకు ఇస్తారని అనుకునే ప్రమాదం ఉంది. వీరి ఆశలు, అంచనాలు చూసి..సగటు వైసీపీ కార్యకర్త… మన రేంజ్ ఇదేనా అని మథన పడుతున్నారు. జైలుకెళ్లిన వాళ్లందర్నీ హోంమంత్రిని చేయాలంటే.. ముందుగా జగన్ రెడ్డి గెలవాలని.. కానీ వీళ్లు మాత్రం వస్తాయని ఇప్పుడే పదవుల ఆశల్లో వేలాడుతున్నారని చింతిస్తున్నారు.