ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వైసీపీలో టెన్షన్ పుట్టిస్తోంది. ఈ నెల 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. రెండు రోజుల ముందే వెళ్తుండటంతో వైసీపీ భయబ్రాంతులకు గురి అవుతోంది.ఈ పర్యటనలో చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలువనున్నారు. అందులో కేంద్రహోంమంత్రి అమిత్ షా పేరు ఉండటమే ఆ పార్టీ భయానికి కారణంగా తెలుస్తోంది.
ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ కీలక విషయాలను రాబట్టిన వేళ షెడ్యూల్ కు ముందే ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో నిందితులు తమకు పైనుంచి వచ్చిన ఆదేశాలతో నడుచుకున్నామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.
నిందితుల స్టేట్ మెంట్స్ ను పరిశీలిస్తే జగన్ అరెస్టుకు సమయం సమీపించినట్లేనని ఇటీవల ప్రచారం ఎక్కువైంది.లిక్కర్ కేసులో జగన్ పాత్రకు సంబంధించి ఆధారాలను కూడా సిట్ సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే షాతో చంద్రబాబు భేటీ అవుతున్నారనే వార్త తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ లో గుబులు రేపుతోందని అంటున్నారు.
అయితే, అమిత్ షాతో చంద్రబాబు భేటీ ఏపీకి సంబంధించి కేంద్రసహకారంపైనే ఉండనుందని వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ మాత్రం ఏదో జరగబోతుందనే తరహలో పరిణామాలు ఉండటంతో బెంబేలెత్తిపోతోంది.