పోలీసులు ఎపుడు వచ్చి తలుపు తడతారోనన్న భయంతో వైసీపీ నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. లిక్కర్ కేసు విషయంలో జరుగుతున్న రోజు వారీ పరిణామాలు ,సోషల్ మీడియాలో జరుగుతున్న అరెస్టు వైరల్ వార్తలతో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదు. రెండు రోజుల కిందటే బెంగళూరు వెళ్లిన ఆయన వెంటనే తిరిగి వచ్చారు. తాడేపల్లిలో వారానికోసారి ఎవరినో ఒకర్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఆ వీడియోలు విడుదల చేస్తున్నారు. అయితే కొత్తగా గురువారం ప్రెస్‌మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
చాలా ముఖ్యమైన పొలిటికల్ ప్రెస్‌మీట్ అని ప్రచారం
జగన్ రెడ్డిరోజూ ఒకటే మాట్లాడతారు. ప్రెస్‌మీట్ పెట్టినా అవే మాట్లాడతారు. అందుకే ఎవరూ. పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ ఈ సారి మాత్రం.. చాలా ముఖ్యమైన అంశంపై ప్రెస్‌మీట్ పెడుతున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. కొంత మంది ప్రో వైసీపీ జర్నలిస్టుల్ని పిలుచుకుని మాట్లాడతారు. అది కూడా రికార్డింగ్ అయి ఉంటుంది. అయితే నిద్రపోకుండా ఇంతగా ఎందుకు కంగారు పడుతున్నారు.. ఎందుకు హడావుడిగా ప్రెస్‌మీట్ పెడుతున్నారన్నది వైసీపీ నేతలకూ కాస్త పజిల్ గానే ఉంది.
లిక్కర్ స్కామ్‌లో అరెస్టు కావడం ఖాయమన్న ప్రచారం
లిక్కర్ స్కామ్ విషయంలో జగన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆయన సన్నిహితులంతా వరుసగా అరెస్టయ్యారు. సీఐడీ సిట్ సేకరించిన ఆధారాలన్నీ జగన్ రెడ్డి వద్దకే వస్తున్నాయి. దోచుకున్న డబ్బు.. వాటిని తమ ఖాతాలకు మళ్లించుకున్న వైనం సహా అంతా టెక్నికల్‌గా దొరికిపోయారు. విజయసాయిరెడ్డి అనధికారిక అప్రూవల్ గా మారి దాదాపుగా అన్ని సీక్రెట్స్ చెప్పేశారు. ఈ కారణంగా జగన్ రెడ్డిని అరెస్టు చేయవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. అందుకే ఆయనకు నిద్ర రావఀడం లేదని.. ఇంటి ముందు ఏ పోలీసు జీపు వెళ్తున్న శబ్దం వినిపించినా ఉలిక్కి పడుతున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి.
అరెస్టు చేస్తారని నడవడానికే ప్రెస్‌మీట్ ?
అరెస్టు చేస్తారని తెలియడంతోనే ఏడ్వడానికి ప్రెస్‌మీట్ పెట్టారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ విషయంలో అసలు స్కామే జరగలదేని చెప్పడంతో అన్నీ అద్భుతమైన బ్రాండ్లు, ప్రజల ఆరోగ్యం కోసం తెచ్చామని.. అవన్నీ చంద్రబాబు హయాంలోనే అనుమతి ఇచ్చారని ఎప్పట్లాగే చెప్పే అవకాశాలు ఉన్నాయి. అదే నిజం అయితే అరెస్ట్ అయిన వారందర్నీ టీడీపీ ఖాతాలో ఎందుకు వేస్తున్నారు.. భారతీ సిమెంట్స్ ఖాతాల్లోకి డొల్ల కంపెనీల ద్వారా వచ్చిన డబ్బుల సంగతేంటి.. పెద్దిరెడ్డి కంపెనీల్లోకి వచ్చిన లిక్కర్ సొమ్ము లంచాల కథేంటి అన్నది కూడా ఆయన చెప్పాల్సిన ఉంది.
మొత్తంగా వైసీపీ నేతలు పాలనలో ఉండి చేసిన నేరాలకు గాను.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.