ఆర్యతో ఓ ట్రెండ్ సెట్ అయ్యింది. లవ్ స్టోరీల్లో అదో మైల్ స్టోన్. ఈ సినిమాతో దర్శకుడిగా సుకుమార్ ప్రతిభేంటో చిత్రసీమకు తెలిసొచ్చింది. అల్లు అర్జున్ కెరీర్‌కి గట్టి పునాది రాయి ఏర్పడింది. ‘ఆర్య 2’ ఫ్లాప్ అయినా ఆ సినిమా అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్లో ‘ఆర్య 3’ టైటిల్ రిజిస్టర్ అయ్యింది.
ఈ టైటిల్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు బన్నీ – సుకుమార్ మళ్లీ కలుస్తారు, ఆర్య ఫ్రాంచైజీ ముందుకు తీసుకెళ్తారు అనుకొన్నారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ఆశీష్ కోసం అని తెలుస్తోంది. ‘రౌడీ బోయ్స్’, ‘లవ్ మీ’ సినిమాలతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నాడు. అయితే ఆ రెండు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి. ఆ తరవాత సుకుమార్ కథతో ‘సెల్ఫిష్’ సినిమా మొదలైంది. అది కూడా మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు రిపేర్లు జరుగుతున్నాయి. ‘ఆర్య 3’ కీ సుకుమారే కథ ఇవ్వబోతున్నాడు. కానీ హీరోగా ఆశీష్ నటిస్తాడు. బన్నీ చేసిన ఆర్య పాత్రకు ఓ కల్ట్ ఫాలోయింగ్ వుంది. ఆ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. ఓ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో… హీరో మారడం కూడా చాలా అరుదుగా చూసే విషయం. సుకుమార్ కథ కాబట్టి, కాస్త నమ్మకం పెట్టుకోవొచ్చు. దర్శకుడు ఎవరన్నది ఇక్కడ పాయింట్. సుకుమార్ మైండ్ ని బాగా అర్థం చేసుకొన్న వాళ్లే ఈ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేయగలరు. సుకుమార్ దగ్గర శిష్యగణానికి కొదవ లేదు. వాళ్లలో ఎవరైనా సరే, ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యాకే.. దిల్ రాజు ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. కానీ అందుకు