బాయ్ కాట్ ‘భైరవం’ అంటూ.. ఆ సినిమాని ఎలాగోలా అడ్డుకోవాలని చూస్తోంది ఓ వర్గం. సినిమా ప్రేమికులు మాత్రం ‘సినిమాని సినిమాలానే చూడాలి.. రాజకీయాల్లోకి లాగడం ఏమిటి?’ అని సినిమా యూనిట్ కి సపోర్ట్ చేస్తున్నారు. దీనిపై హీరో మంచు మనోజ్ మనసు విప్పారు. తెలుగు 360కి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో ‘భైరవం’ బాయ్ కాట్ పై స్పందించారు.
”సినిమాకి కులాలు ఉండవు. ఆధార్ కార్డులు, కులం చూసి హీరోని ప్రేమించరు. ఇదో ఫాల్స్ ట్రెండ్ లా అనిపిస్తోంది. కులం రాజకీయాల్లోకి చొచ్చుకు పోయింది. సినిమాల్లోకి కూడా వచ్చేసింది. దర్శకుడు విజయ్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఆయనపై ఇష్టంతోనే ఏలూరు ఈవెంట్ లో అలా మాట్లాడారు. అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. ఆయన మెగా హీరోలని దృష్టిలో ఉంచుకొని ఫేస్ బుక్లో ఓ పోస్ట్ చేశారని అంటున్నారు. అదెప్పుడో జరిగిన సంగతి. అది కూడా ఆయన చేశారా, లేదా? అనేది తెలీదు. పవన్ కల్యాణ్ వీరాభిమాని ఇలా ఎందుకు చేస్తాడనైనా ఆలోచించండి. ‘భైరవం’ కోసం అంతా చాలా కష్టపడ్డాం. మేం సినిమా వాళ్లం. పాలిటిక్స్ ని రుద్దుకోవడం మాకు ఇష్టం లేదు” అని స్పష్టం చేశారు.
మనోజ్ తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన సినిమా ఇది. తమిళ చిత్రం ‘గరుడన్’కి రీమేక్. అయితే కథలో చాలా మార్పులు చేశారు. ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు. సెన్సార్ కూడా పూర్తయ్యింది. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మనోజ్ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.