థియేటర్ల బంద్కు ఎగ్జిబ్యూటర్లు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్లో వాడిగా, వేడిగా చర్చలు సాగినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. అఖిల్ పక్ష సమావేశంలో ఎగ్జిబ్యూటర్లకూ, డిస్టిబ్యూటర్లకు మధ్య రాజీ కుదిరింది. బంద్ బాంబు నుంచి ముప్పు తప్పింది. అయితే చాలా విషయాలపై విస్క్రృతమైన చర్చ నడిచినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడంపై నిర్మాతలు గట్టిగా తమ వాదనని వినిపించార్ట. ఈ సమావేశంలో కొన్ని సైడ్ లైట్స్…
* టికెట్ రేట్లపై ఎలాంటి గొడవా లేదని, అయితే థియేటర్లో చిరుతిళ్లు, తినుబండాలరాల రేట్లని తగ్గించాల్సిన అవసరం ఉందని చాలామంది నిర్మాతలు గట్టిగా పట్టుబట్టారు. పార్కింగ్ ఫీజు లేకుండా ఉంటే మరింత బాగుంటుందన్నది చాలామంది అభిప్రాయం.
* చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నప్పుడు రీ రిలీజుల గోల లేకుండా చేయాలి. రీ రిలీజుల వల్ల చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి. థియేటర్లో సినిమాలు లేనప్పుడు మాత్రమే రీ రిలీజులపై దృష్టి పెట్టాలి.
* పెద్ద హీరోలు సంవత్సరానికి కనీసం ఒక సినిమా అయినా చేసేలా చూడాలి. ఈ విషయంపై హీరోలందరితోనూ ఓ భేటీ వేసి, వాళ్లని ఒప్పించగలగాలి.
* పైరసీ బెడద తగ్గించడానికి, ఐబొమ్మ లాంటి పైరసీ సైట్ల జోరు అరికట్టడానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలి.
* ఓటీటీల ఆధిపత్యం తగ్గాలి. వాళ్ల షరతులకు తలొగ్గకూడదు.
* టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చారని ఇష్టానుసారం పెంచకూడదు. వీకెండ్ కి ఒకలా, వీక్ డేకి మరోలా ఉండేలా ఫ్లెక్సిబుల్ రేట్లు నిర్ణయించాలి.
* సినిమా ప్రమోషన్ల విషయంలో హీరోలు, హీరోయిన్లు, మిగిలిన సాంకేతిక సిబ్బంది కోపరేట్ చేయాలి.
* ముఖ్యంగా నిర్మాతలపై భారం తగ్గాలి. హీరోలు పారితోషికాలు తగ్గించుకోవాలి. సినిమా హిట్టయి, మంచి లాభాలొస్తే అప్పుడు అందులో వాటా ఇవ్వొచ్చు.
ఇలా చాలా విషయాలపై విస్త్రతంగా చర్చ జరిపారు. సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ కూడా వేయబోతున్నారు. ఆ కమిటీ ఏళ్ల తరబడి సమయం తీసుకోకుండా, నిర్దిష్టమైన కాల