హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఊపు రాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి హై రేట్స్. ఇప్పటికే అత్యధిక రేట్ల స్థాయికి రియల్ ఎస్టేట్ మార్కెట్ చేరుకుంది. వచ్చే ఐదేళ్ల తర్వాత ఎంత విలువ ఉంటుందో అంచనా వేసుకుని రియల్టర్లు ఇప్పుడే ఆ ధరకు అమ్మడం ప్రారంభించారు. అందుకే రేట్లు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది కాబట్టి కొనుగోలుదారులు వెయిట్ చేస్తున్నాయి.
ధరలు కొంత కాలం స్థిరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో ఎన్నారైలది కీలక పాత్ర. అమెరికాలో ట్రంప్ నిర్ణయాలతో కొంత మేర అక్కడి నుంచి వచ్చే పెట్టుబడులపై ప్రభావం కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఐదు శాతం టాక్స్ వేయడం.. ఉద్యోగాల విషయంలో ఆంక్షలు ప్రభావం చూపుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ లో సెకండ్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ధరలే . నివాసం ఉండటానికి సొంత ఇల్లు కొనాలనుకున్నవారు అధిక ధరల కారణంగా పాత గృహాల వైపు చూస్తున్నారు. కాస్త ఆర్థికంగా స్థితిమంతంగా ఉండి.. పెట్టుబడి కోణంలో చూసేవారే ఇప్పుడు ఇళ్లు కొంటున్నారు. మళ్లీ కరెక్షన్ రావాలంటే.. కొంత కాలం పడుతుంది. అది ఎంత కాలం అన్నది చెప్పడం కష్టం.