ఆంధ్రప్రదేశ్ కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (APCRDA) పరిధి ఇప్పుడు రియల్ ఎస్టేట్ హాట్ ప్రాపర్టీ. ఇక్కడ స్థలాల ధరలు బయట జరుగుతున్న ప్రచారంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. చాలా గ్రామాల్లో CRDA అనుమతి లేఔట్లలో ఒక చదరపు గజం ధర రూ. 12,000 నుండి మొదలవుతున్నాయి. సీఆర్డీఏ అనుమతి ఇవ్వాలంటే 40 అడుగుల బ్లాక్‌టాప్ రోడ్లు, నీటి సదుపాయం, డ్రైనేజీ వంటి సౌకర్యాలు ఉండాలి.
తాడికొండ, కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, గుంటూరు శివారులోని గొరంట్ల వంటి చోట్ల స్థలాలకు ఇప్పుడు తక్కువ వరకే లభిస్తున్నాయి. 150 చదరపు గజాల స్థలాలు రూ. ఇరవై లక్షలకు లభిస్తున్నాయి. చాలా ప్రాజెక్టులకు బ్యాంకులు లోన్ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్, ఐకానిక్ బ్రిడ్జ్ వంటివి నిర్మాణంలో ఉన్నాయి. సీడ్ క్యాపిటల్ లో వెంచర్లు అందుబాటులో ఉండవు. కానీ సీఆర్డీఏ పరిధిలో మాత్రం స్థలాలు భవిష్యత్ పెట్టుబడికి మంచి అవకాశాలు ఉంటాయి.
గుంటూరు, విజయవాడ మధ్యలో అమరాతి ఉంటుంది. సీఆర్డీఏకు గుంటూరు వైపు, కృష్ణాజిల్లా వైపు పెద్ద ఎత్తున వెంచర్లు వెలుస్తున్నాయి. నిజానికి గతంలోనే వేసిన వెంచర్లలో ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. ఐదు సంవత్సరాల పాటు పెద్దగా లావాదేవీల్లేని వెంచర్లు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. వచ్చే మూడేళ్లలో ఊహించనంత పెరుగుదల కనిపించే అవకాశం ఉంది.