ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో తెలుగు అథ్లెట్ జ్యోతి యార్రాజీ స్వర్ణపతకం సాధించారు. దక్షిణ కొరియాలోని గుమిలో జరుగుతున్న పోటీల్లో కొత్త ఛాంపియన్షిప్ రికార్డు నెలకొల్పింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో 12.96 సెకన్ల టైమింగ్‌తో మొదటి స్థానం దక్కించుకున్నారు. జ్యోతి యర్రాజీని చంద్రబాబు, జగన్ ?అభినందించారు. ఇటీవల ఒలింపిక్స్ లోనూ జ్యోతి యర్రాజీ పోటీ పపడ్డారు. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్ లో పోటీ పడ్డారు.
విశాఖపట్నంలో పేద కుటుంబంలో జన్మించిన జ్యోతి యర్రాజీ అంతర్జాతీయంగా అధ్లెట్గా తనదైన ముద్ర వేయడానికి అవిశ్రాంత శ్రమే కారణం. ఆమె శ్రమకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన గాండీవ ప్రాజెక్టు చేయూతనిచ్చింది. గాండీవ ప్రాజెక్టు ద్వారా టెన్ విక్ అనే సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ అందించింది. ఈ టెన్ విక్ సంస్థ మాజీ క్రికెట్ అనిల్ కుంబ్లేది. అనిల్ కుంబ్లే క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత క్రీడా సేవల సంస్థ టెన్విక్ను ప్రారంభించారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రీడా సంబంధిత కార్యక్రమాలు చేపట్టింది. చంద్రబాబు హయాంలో టెన్విక్ సంస్థ ఏపీ సర్కార్‌కు పలు సేవలు అందించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంత క్రీడాకారులను గుర్తించడం కోసం ప్రాజెక్ట్ గాండీవను ప్రారంభించారు. ఇలాంటి సేవలను టెన్ విక్ సంస్థ అందించింది. ఏపీలో చేపట్టిన కార్యక్రమాల గురించి.. టెన్విక్ సంస్థ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అనిల్ కుంబ్లే సంస్థకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో ప్రాజెక్టు ఆగిపోయింది. ఓ సారి కుంబ్లే వచ్చి తన కంపెనీకి ఇవ్వాల్సిన బిల్లుల గురించి మాట్లాడి వెళ్తే స్పోర్ట్స్ యూనివర్శిటీ అని ప్రచారం చేసుకున్నారు. కానీ ఏదీ లేదు. గాండీవ ప్రాజెక్టు వల్ల శిక్షణ పొందిన వారు వెలుగులోకి వస్తున్నారు.