సమస్యను బలంగా చెప్పాలి. ఆ సమస్య ఎంత ప్రమాదకరమో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. అలా చెబితేనే పరిష్కారాలు వస్తాయి. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు కొన్ని సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి. అలాంటి సమయంలో తాము లేవనెత్తిన సమస్య వల్ల ఎన్ని ఉపద్రవాలు వస్తాయో బలంగా వివరించాలి. అలా చెప్పేందుకు న్యూజిలాండ్ కు చెందిన మహిళా ఎంపీ సాహసం చేశారు. ఏకంగా తన న్యూడ్ ఫోటోలను పార్లమెంట్ లో అందరి ముందు చూపించారు. దీంతో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ మహిళా ఎంపీ లేవెనత్తిన సమస్య వైపు చూస్తోంది.
న్యూజిలాండ్ ఎంపీ లారా మక్లూర్ తన ఏఐ-జనరేటెడ్ డీప్‌ఫేక్ న్యూడ్ ఫోటోను పార్లమెంట్లో ప్రదర్శించారు. తాను కేవలం ఐదు నిమిషాల్లో ఈ డీప్‌ఫేక్ తయారు చేశానని చెప్పారు. తన మామూలు ఫోటోను ఇలా న్యడ్ గా తయారు చేయడం క్షణాల్లో జరిగిపోతోందని ఇలాంటి వాటి వల్ల సమాజానికి ఎంతో నష్టం జరుగుతోందని ఆమె స్పష్టం చేశారు. న్యూజిలాండ్ పార్లమెంట్ లో ఆమె డీప్ ఫేక్ ను నేరంగా పరగిణించే బిల్లును ప్రతిపాదిచారు. సమ్మతి లేకుండా సెక్సువల్ డీప్‌ఫేక్‌లను సృష్టించడం మరియు షేర్ చేయడాన్ని నేరంగా పరిగణించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
ఈ బిల్లు ఎంత ముఖ్యమో పార్లమెంట్ దృష్టికి తీసుకు రావడానికి ఎంపీ లారా మక్లూర్ సాహసం చేశారు. దీనికి కారణం ఉంది. ఆమె అధికార పార్టీ ఎంపీ కాదు. ప్రభుత్వ మద్దతు లేదు. అందుకే ఎంపీ తన ఏఐ ఫేక్ న్యూడ్ ఫోటోను ప్రదర్శించారు. మహిళా ఎంపీ సాహసం పార్లమెంట్ సభ్యులను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫేక్ ఫోటోను పట్టుకోవడం “భయానకంగా”, “అసౌకర్యంగా” అనిపించిందని, కానీ బాధితులకు ఇది ఎంత హానికరమో చూపించడానికి తప్పలేదని ఎంపీ చెప్పారు.
న్యూజిలాండ్ ఎంపీ లేవనెత్తిన సమస్య ఆమె ఒక్కరిది కాదు. ప్రపంచం మొత్తం ఉంది. ప్రపంచవ్యాప్త సమస్య పరిష్కారం కోసం ఆమె తనను తాను సమిధగా వాడుకున్నారని అనుకోవచ్చు. మరి ఆ మహిళా ఎంపీ పోరాటానికి తగ్గట్లుగా డీప్ ఫేక్ దుర్వినియోగంపై యుద్ధాన్ని ప్రభుత్వాలు ప్రకటిస్తాయా ?