బిగ్ అండ్ బ్యూటీఫుల్ బిల్ ను విభేధించడంతో ఎలాన్ మస్క్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి మధ్య వార్ మొదలైంది. తన సహకారం వల్లే ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాడని మస్క్ అంటే.. నువ్వెంది. నువ్వు లేకపోయినా నేను గెలిచేవాడిని అంటూ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. అంతేనా.. ఎక్కువ, తక్కువ మాట్లాడితే నీ వ్యాపార వ్యవహారాలకు సహకరించే సంస్థలపై అధిక పన్నులు వేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చేశారు. బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండి ఇప్పుడు ఎనిమీస్ గా మారుతోన్న ఈ వివాదంలో తాజాగా మరో మలుపు.
నాకు తిక్క రేపితే ఎలా ఉంటుందో చూపిస్తానని సవాల్ విరిరినట్టుగా పెద్ద తేనె తుట్టెనే కదిపారు మస్క్. ఇది అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. మస్క్ ఏం చేశాడంటే…జెఫ్రీ ఎప్ స్టీన్ అనే వ్యక్తి పేరును తెరమీదకు తీసుకొచ్చారు అంతే. ఆ తర్వాత ఆయనతో ట్రంప్ కలిసి ఉన్న ఫోటోలు సర్క్యూలేట్ అవుతుండటం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
జెఫ్రీ ఎప్ స్టీన్… 2019లోనే మరణించారు. ఆయన హైప్రొఫైల్ కలిగిన అమెరికన్స్ కు అమ్మాయిలను ట్రాప్ చేసి సరఫరా చేసేవారు. ఇతని కస్టమర్లు అంతా బలవంతులు కావడంతో ఎవరు ఎప్ స్టీన్ ను టచ్ చేసే సాహసం చేయలేదు. కానీ, 2005లో తన కుమార్తెను వేధించాడని ఓ వ్యక్తి ఆయనపై కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు అయింది. జైలుకు వెళ్లి వచ్చినా ఎప్ స్టీన్ పాత బిజినెస్ మానలేదు. చివరికి 2019లో అతని పాపం పండి..జైలుకు వెళ్లాడు. అయితే , రిమాండ్ లో ఉండగానే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతనే ఉరి వేసుకొని చనిపోయినట్టు పోలీసు ఇన్వెస్టిగేషన్ లో తేల్చడంతో ఈ కేసును కోర్టు కూడా కొట్టివేసింది. కానీ, మృతుడి తరఫు న్యాయవాదులు ఆయనది హత్యలేనని ఆరోపించినా ప్రూవ్ చేయలేకపోయారు.
అయితే, ఎప్ స్టీన్ తన కస్టమర్ల వివరాలను రహస్యంగా ఉంచిన ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్న అక్కడి అధికారులు భద్రంగా ఉంచారు. కానీ, వాటిని అక్కడి అధికారులు బయటపెట్టలేకపోతున్నారు. వాటిని బయటపెడితే సంచలనాలు నమోదు అవుతాయి. ఆ ఫైల్స్ లో చిన్నారులు, యువతులకు చెందిన సమాచారం ఉందని, వాటిని బయటపెడితే వారి ప్రైవసీకి భంగం కల్గించినట్టుగా ఉంటుందని ఆపేసినట్లు చెబుతున్నారు. ట్రంప్ తో విబేధాలు రావడంతో ఇంతలో ఎలన్ మస్క్ బిగ్ బాంబ్ పేల్చారు. ఎప్ స్టీన్ పేరును తెరమీదకు తీసుకొచ్చారు. కారణం.. డొనాల్డ్ ట్రంప్ కూడా ఎప్ స్టీన్ కస్టమర్ అని చెబుతున్నారు. అందుకే ఆ ఫైల్స్ ను బయటపెట్టాలని మస్క్ డిమాండ్ చేస్తున్నారు. ఎప్ స్టీన్ ఫైల్స్ బయటపెడితే ట్రంప్ బండారం బయటపడుతుందని చెబుతున్నారు.