శేఖర్ కమ్ముల ఫిల్మ్ మేకింగ్ చాలా డిఫరెంట్. సినిమాకి కథ రాయడంలో ఆయనకి ఎలాంటి కండీషన్లు ఉండవు. డెడ్‌లైన్ పెట్టుకోకుండా ఆర్గానిక్‌గా రాసుకోవడం ఆయన స్టయిల్. ఇక ప్రొడక్షన్లో కూడా ఎలాంటి హడావుడి ఉండదు. రిలీజ్ డేట్‌కి ముందు హైరానా పడిపోవడం ఆయనకి అలవాటు లేదు. ఆయన సినిమాల్లోని పాటలు ముందే జనాల్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఈసారి ‘కుబేర’కి మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది.
జూన్ 20న సినిమా రిలీజ్. కానీ ఇప్పటికీ ఇంకా రెండు పాటలు రెడీ కావాలి. ఇది కొంచెం వింతగానే ఉంది. దేవిశ్రీ దగ్గర డిలే జరిగిందో, లేదా ట్యూన్లు ఓకే కాలేదేమో తెలియదు కానీ, రిలీజ్‌కి వారం ముందే ఇంకా రెండు పాటలు చేయించుకోవాలి అంటే మామూలు జాప్యం కాదిది.
శేఖర్ కమ్ముల ఫిల్మ్ మేకింగ్‌లో ఓ ఇష్యూ ఉంటుంది. ఆయన రాసినదంతా తీస్తారు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కుప్పలుగా రష్‌లు ఉంటాయి. ‘కుబేర’కి కూడా అదే జరిగింది. ఇప్పుడు ఎడిటర్‌కి బోలెడు పని ఉంది. ప్రస్తుతం ఫైనల్ వెర్షన్ రెడీ చేయడంలో శేఖర్ యమా బిజీగా ఉన్నారు. దీనికి తోడు రెండు పాటలు కూడా యాడ్ చేయించాలంటే మామూలు పని కాదు.
నిజానికి ఆ రెండు పాటలు జనాల్లోకి వెళ్ళడానికి టైం కూడా లేదు. నేరుగా థియేటర్లోనే చూడాలి. బేసిక్‌గా దేవిశ్రీ మ్యూజిక్ అంటే పాటలకి ఒక అట్రాక్షన్ ఉంటుంది. పాటల విషయంలో శేఖర్ కమ్ముల ట్రాక్ రికార్డ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈసారి ఆయన దేవితో జతకట్టారు. ఈ రకంగా చూస్తే ‘కుబేర’ ఆల్బమ్ ఇంకాస్త స్పెషల్‌గా ఉండాల్సింది. అయితే దానికి తగ్గట్టుగా ‘కుబేర’ ఆల్బమ్ రెడీ కాలేదనే చెప్పాలి.