అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన విచారణలో అధికారులు కీలక పురోగతి సాధించారు. ప్రమాదానికి గల కారణం ఏంటనేది తేల్చేందుకు కీలకంగా భావించే బ్లాక్ బాక్స్ లభ్యం అయింది. దర్యాప్తులో ఈ బ్లాక్ బాక్స్ కీలకం కానుంది. ప్రమాదానికి గురైన పైకప్పుపై దీన్ని అధికారులు గుర్తించారు.
ఈ బ్లాక్ బాక్స్ లభ్యం కావడంతో దర్యాప్తు బృందం విమాన ప్రమాదానికి గల కారణంపై విశ్లేషణ ప్రారంభించనుంది. బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేసి అందులోని సమాచారాన్ని విశ్లేషిస్తే ఈ ప్రమాదానికి గల కారణం ఏంటనేది కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు ఈ బ్లాక్ బాక్స్ లో పూర్తి డేటా ఉంటుంది. అందుకే విమానంకు ఎలాంటి ప్రమాదం జరిగినా బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా తయారు చేస్తారు.
మరోవైపు, విమానం శకలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ ను ఏటీఎస్ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా విమానం ప్రమాదానికి గురయ్యే ముందు ప్లైట్ లోపలి రికార్డ్ అయిన దృశ్యాలు బయటకు వస్తాయి. డీవీఆర్ లభ్యం అయిన కాసేపటికే బ్లాక్ బాక్స్ లభ్యం అయింది.