1300 SFT ఫ్లాట్ కొన్నానురా అని మిత్రుడు చెబితే.. వెళ్లి చూసిన వాళ్లకి.. అంత లేదుగా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆ 1300 SFT ఫ్లాట్లోనే రెండు బెడ్రూంలు, హాలు, కిచెన్ ఇరుకిరుకుగా ఉంటాయి. ఊహించుకున్న విశాలమైన ఫ్లాట్ కు.. నిజంగా ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఇలా ఎందుకనే డౌట్ చాలా మందిని పట్టి పీడిస్తుంది. నిజానికి డబ్బులు వసూలు చేసేది 1300SFTకే కానీ.. ఏ బిల్డర్ కూడా 1000 SFT కన్నా ఎక్కువ యజమానికి హ్యాండోవర్ చేయడు.
ఒక 2 BHK ఫ్లాట్లో స్థల విభజన బిల్డర్ డిజైన్ , లేఅవుట్పై ఆధారపడి ఉంటుంది. రెండు బెడ్ రూంలు, లివింగ్ రూమ్, కిచెన్ కామన్ బాత్రూమ్, పూజగది కలిపి 1000 SFT ఉంటుంది. మరిమిగతా 300 SFT కి మనం డబ్బులు కట్టాలి. ఆ మూడు వందల్లో కారిడార్/పాసేజ్* లాబీ, స్టెయిర్కేస్, లిఫ్ట్లు లాంటి కామన్ ఏరియాకు వెళ్లిపోతుంది. కారిడార్లు ఎంత విశాలంగా ఉంటే అపార్టుమెంట్ ఫ్లాట్ అంత తగ్గిపోతుందన్నమాట.
కార్పెట్ ఏరియా వేరు.. సూపర్ బిల్ట్-అప్ ఏరియా వేరు. 1300 SFT అనేది సాధారణంగా సూపర్ బిల్ట్-అప్ ఏరియాగా భావిస్తారు. గోడలు, కామన్ ఏరియాలతో సహా సూపర్ బిల్ట్ అప్ ఏరియా. కానీ కార్పెట్ ఏరియా వాస్తవంగా ఉపయోగించే స్థ సుమారు 70-80 శాతం ఉంటుంది. అంటే 900-1000 SFT.
ఫ్లాట్ కొనే ముందు బిల్డర్ నుంచి ఫ్లోర్ ప్లాన్ తీసుకొని, రూమ్ల సైజు, కార్పెట్ ఏరియా, కామన్ ఏరియా గురించి క్లారిటీ వస్తుంది. ఎంత మొత్తానికి కట్టినా.. కార్పెట్ ఏరియానే అసలు ఉండటానికి ఉపయోగపడుతుంది.