ఏపీ, తెలంగాణ సీఎంలుగా ఉన్నప్పుడు కేసీఆర్, జగన్ ఫోన్ ట్యాపింగులు చేయించారని.. తన ఆడియోను వైవీ సుబ్బారెడ్డి నేరుగా తన ఇంటికే వచ్చి వినిపించారని వైఎస్ షర్మిల ఆరోపించారు. అదే విషయాన్ని అన్ని టీవీలు, మీడియాలు చూపించాయి. మరి సుబ్బారెడ్డి ఏం చేయాలి ?. అలా షర్మిలకు ట్యాపింగ్ ఆడియో వినిపించకపోతే.. అదే విషయాన్ని చెప్పాలి. కానీ సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ తెలివి తేటల్ని చూపించిసోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్ ట్యాప్ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. షర్మిల ఫోన్‌ను ట్యాప్‌చేసి కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడి సీఎంకు ఎందుకు ఇస్తుంది? అసలు కేసీఆర్‌గారి ప్రభుత్వం ట్యాప్‌చేసిందా?లేదా? అన్నది నాకు తెలియదు. టీడీపీకి సంబంధించిన ఎల్లో టీవీల్లో,పత్రికల్లో నాపేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నాను… అని ట్వీట్ చేశారు.
సుబ్బారెడ్డి ట్వీట్ చూసి.. పాపం సుబ్బారెడ్డి తేలు కుట్టిన దొంగలాగా.. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. అసలు ఆ ఆరోపణ చేసింది షర్మిల. ఏమైనా సిగ్గూశరం, ధైర్యం ఉంటే షర్మిలకు సమాధానం చెప్పాలి కానీ.. టీడీపీ మీడియాలో వచ్చిందని సొల్లు వాగడం ఎందుకన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డి జగన్ రెడ్డి దగ్గర మాటలు షర్మిలకు.. షర్మిల దగ్గర మాటలు జగన్ రెడ్డికి చెప్పి ఇద్దరి మధ్య గ్యాప్ పెంచడానికి మరింత కారణం అయ్యారని సులువుగా అర్థమైపోతుంది. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయే సరికి.. అటు షర్మిలకు సమాధానం చెప్పలేక.., ఇటు జగన్ కు ముఖం చూపించలేకపోయే పరిస్థితి ఏర్పడింది.
వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి తేలివితేటల్ని చూపిస్తూ ఉంటారు. సొంత కుటుంబసభ్యుల్ని కూడా అడ్డగోలుగా మోసం చేసుకుంటూ… టీడీపీ పత్రికలు, ఎల్లో మీడియా అంటూ.. ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు.