ఇలా కూడా డబ్బులు సంపాదిస్తారా అని కొంత మంది ఆశ్చర్యపోయేలా చేస్తూంటారు. అలాంటి వారిలో ఈ హైదరాబాద్ స్వీటీ కపుల్ ముందు ఉంటారు. క్యాబ్ డ్రైవర్ గా పని చేసే వ్యక్తి.. తన భార్యతో కలిసి ..లైవ్ శృంగారాన్ని చూసే అవకాశాన్ని కల్పిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. హైదరాబాద్ అంబర్ పేటలో తన ఇంట్లోనే హెడ్ డీ కేమెరాలతో లైవ్ సెటప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆన్ లైన్ లో లైవ్ లో తమ శృంగారాన్ని చూడాలనుకుంటున్న వారు డబ్బులు పంపితే లింక్ పంపిస్తారు. చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఒక్కో లింక్ కు రెండు వేలు వసూలు చేస్తున్నారు.
ఇదొక్కటే కాదు.. వారి శృంగార వీడియోలు… శృంగార చాట్ సౌకర్యాలను కూడా అందిస్తున్నారు. నాలుగు నెలలుగా వీరి బిజినెస్ పెరిగిపోవడంతో ఆ నోటా ఈ నోటా పడి పోలీసులకు చేరింది. చివరికి పోలీసులు రెయిడ్ చేశారు. పట్టుకున్నారు. కానీ అదేమంత పెద్ద నేరం కాదు. రేపు బయటకు వచ్చి మళ్లీ అదే చేసుకుంటారు. ఈ జంట బరితెగింపు సమాజాన్ని ఆశ్చర్య పురస్తోంది.
నిజానికి ఇలాంటి లైవ్ సర్వీసుల్ అందించే యాప్స్ ఉంటాయి. వాటి సంగతి ఈ జంటకు తెలియదేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మారుతున్న సమాజంలో.. డబ్బు సంపాదన కోసం ఎలాంటి పనులు అయినా చేయడానికి కొంత మంది సిద్ధపడుతున్నారని ఇలాంటి వారిని పట్టుకున్నప్పుడు అందరూ భావిస్తున్నారు.