గుడివాడలో చేసిన ఆరాచక పనిపై ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని గుడివాడ కోర్టుకు వచ్చారు. తనకు గుండె ఆపరేషన్ జరిగిందని రెగ్యులర్ అబ్జర్వేషన్ లో లేకపోతే కష్టమని నమ్మించేందుకు గుండె ప్రాంతంలో పట్టీ వేసుకుని వచ్చారు. అది కూడా అందరికీ కనిపించేలా చొక్కాపైన వేసుకొచ్చారు. తనపై సానుభూతి రావాలని ఆయన ఆ పని చేశారని అందరికీ అర్థమైంది.
కొడాలి నాని చాలా రోజుల కిందట.. ఓ పెళ్లికి వెళ్లారు. ఆ పెళ్లికి వెళ్లినప్పుడు ఆయన ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. అప్పుడు ఈ పట్టీ లేదు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ఇక పోలీసులు తమ ప్రయత్నాలు తాము చేస్తారని అనుకుంటున్న సమయంలో.. మళ్లీ ఓ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకు ఇన్ ఫెక్షన్ వచ్చే చాన్స్ ఉందని రెండు నెలల పాటు ఎవరూ కలిసేందురు రావొద్దని ప్రెస్ నోట్ ఇచ్చారు. మధ్యలో ఆయన అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారన్న ప్రచారం జరిగింది.
కొడాలి నాని ఆరోగ్యం మెరుగుపడిందని సన్నిహితులు చెబుతున్నారు. ఆయన యాక్టివ్ గా ఉన్నారని అంటున్నారు. కానీ చేసిన నేరాల నుంచి తప్పించుకునేందుకు ఆయన అనారోగ్యాన్ని సాకుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన చెస్ట్ కు పట్టీ పెట్టుకుని రావాలనుకుంటే.. ముందుగా పట్టీ పెట్టుకుని ఆ తర్వాత చొక్కా వేసుకుంటారు..కానీ ఆయన మాత్రం చొక్కాపై పట్టీ వేసుకుని రావడంతో ఆయన సానుభూతి డ్రామాలకు సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.