మంచు ఫ్యామిలీకి ‘కన్నప్ప’తో బిగ్ రిలీఫ్ దొరికింది. ఈ సినిమాని విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ లా డీల్ చేశాడు. తన వంతు చాలా కష్టపడ్డాడు. సినిమాకి యావరేజ్ మార్కులే పడ్డా, తనపై ట్రోలింగ్ రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ స్థాయి వసూళ్లు మంచు ఫ్యామిలీ చూసి చాలా ఏళ్లయ్యింది. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా, రాదా? అనేది పక్కన పెడితే.. విష్ణు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా ‘కన్నప్ప’ నిలబడడం ఖాయం.
ఈ సినిమా కోసం దాదాపు రూ.300 కోట్లు ఖర్చు పెట్టానని విష్ణు ఇది వరకే చెప్పాడు. కానీ స్క్రీన్ పై ఆ ఖర్చు కనిపించలేదు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంత భారీ స్థాయిలో లేవు. మోహన్ లాల్, ప్రభాస్ పారితోషికం తీసుకోకుండానే పని చేశారు. ప్రభాస్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విష్ణు ఇది వరకే చెప్పాడు. మోహన్ లాల్ చేసింది కూడా ఒక్క సీనే. ఆయనా రెమ్యునరేషన్ అందుకోలేదు. శరత్ కుమార్ ది లెంగ్తీ క్యారెక్టర్. కాకపోతే.. ఆయనకూ మోహన్ బాబుకీ మంచి ఎటాచ్మెంట్ ఉంది. ఆయన కూడా డబ్బులు తీసుకోలేదని తెలుస్తోంది.
ఇక అక్షయ్ కుమార్ కి మాత్రం కాస్త గట్టిగానే ఇచ్చారని తెలుస్తోంది. ఆయన పారితోషికం రోజుకి రెండు కోట్లని టాక్. మొత్తంగా 5 రోజుల పాటు షూటింగ్ కి వచ్చారని, మొత్తంగా అక్షయ్ కు పది కోట్ల వరకూ ఇచ్చారని సమాచారం అందుతోంది. టోటల్ గా చూస్తే.. అక్షయ్ ఒక్కడే గట్టిగా పారితోషికం అందుకొన్నాడు. విష్ణు సొంత సినిమా, మోహన్ బాబే నిర్మాత కాబట్టి వాళ్ల పారితోషికాలు లెక్కలోకి రావు. ఎలా చూసినా కాస్టింగ్ పరంగా విష్ణు ఖర్చు పెట్టింది తక్కువే అనిపిస్తోంది.
సినిమాకు యావరేజ్ మార్కులొచ్చాయి. రేటింగులూ అంతే. అయితే ఓటీటీ పరంగా మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ విష్ణు ఓటీటీ, శాటిలైట్ అమ్మలేదు. ఈ రెండు డీల్స్ త్వరలో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండింటి నుంచి ఎంతొస్తుంది? అనేదాన్ని బట్టే.. విష్ణు సేఫ్ అవుతాడా, లేదా? అనే విషయం తెలుస్తుంది.