నిర్మాత నాగవంశీ ట్విట్టర్లో కాస్త బిజీగానే ఉంటుంటారు. తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చే హైప్ మామూలుగా ఉండదు. ‘డాకూ మహారాజ్‌కు’ ఇలాంటి హైపే తీసుకొచ్చారు ఆయన ట్వీట్లతో. ఇప్పుడు ‘కింగ్ డమ్’ ని పైకి లేపుతున్న విధానం మామూలుగా లేదు.
‘కింగ్ డమ్’ గురించి నాగవంశీ ఎప్పుడు ప్రస్తావించినా ఓ హై మూమెంట్ వచ్చేస్తుంటుంది. గత ఇంటర్వ్యూల్లో ఇదే కనిపించింది. ఈరోజు ఆయన కింగ్ డమ్ గురించి ఓ ట్వీట్ చేశారు. ”నేను గట్టిగా నమ్మితే గానీ ఏదీ చెప్పను. ఎందుకంటే అది కొంచెం మిస్ అయినా మీ క్రియేటివిటీ అంతా చూపిస్తారు నా మీద. కానీ ఈ సినిమా చూసి చెబుతున్నా.. ఫుల్ మీల్.. కమర్షియల్ ఎంటర్టైనర్.. గౌతమ్ స్టైల్లో. త్వరలో అదిరిపోయే టీజర్, పాటతో కలుద్దాం” అంటూ ట్వీట్ చేశారు.
విజయ్ దేవరకొండ గత సినిమాలు బాగా నిరుత్సాహ పరిచాయి. విజయ్‌కి గానీ, తన ఫ్యాన్స్ కి గానీ.. ఓ మంచి సినిమా కావాలిప్పుడు. నాగవంశీ ఇస్తున్న హైప్ నిజమైతే, విజయ్ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడినట్టే. రిలీజ్ డేట్ తో రాబోయే టీజర్ చూస్తే కానీ, నాగవంశీ చెబుతున్న మాటల్లో నిజం ఎంతన్నది అర్థం కాదు.
పనిలో పనిగా… పవన్ కల్యాణ్ సినిమా ‘హరి హర వీరమల్లు’ గురించి కూడా ఓ ట్వీట్ వేశారు నాగవంశీ. త్వరలోనే ట్రైలర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ నాగవంశీ చూసేశారు. అందుకే వీరమల్లు సర్ప్రైజ్ చేస్తాడు.. ట్రైలర్ తరవాత ఈ సినిమా గురించి మరింత మాట్లాడుకొంటారంటూ ఓ ట్వీట్ వేశాడు నాగవంశీ. పవన్ ఫ్యాన్స్‌కి ఈ మాత్రం బూస్టప్ చాలుగా.