అమెరికాలో కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమవుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన “బిగ్ బ్యూటిఫుల్ బిల్” ఆమోదం లభించిన తర్వాత రోజే తాను పార్టీ పెడతానని ఆయన ప్రకటించారు. ఈ బిల్లు అమెరికాను దివాలా తీయిస్తుందని ఎలాన్ మస్క్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ బిల్లును ప్రతిపాదించిన కారణంగానే ఆయన ట్రంప్‌కు గుడ్ బై చెప్పారు. అయితే రాజకీయాల్ని మాత్రం వదలడం లేదు. ఆ బిల్లుపై తన వ్యతిరేకత కొనసాగిస్తున్నారు.
ఈ బిల్లులో ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహన సబ్సిడీల రద్దు అంశం ఉంది. ఇది టెస్లాను దెబ్బతీస్తుందని మస్క్ అనుకుంటున్నారు. అలాగే ఇతర క్లీన్ ఎనర్జీ, స్పేస్ ఎక్స్ వ్యాపారాలకూ ప్రోత్సాహకాలుతగ్గిపోతాయి. అలాగే అమెరికాపై రుణభారం పెరుగుతుందని ట్రంప్ అంటున్నారు. అందుకే ఎలాగైనా ఆ బిల్లును ఆపాలని ప్రయత్నిస్తున్నారు. కొత్త పార్టీ పెడతానని ట్రంప్ ను మస్క్ బెదిరిస్తున్నారు. గతంలో ట్రంప్ సొంత పార్టీపై ఎక్స్ లో పోల్ నిర్వహించారు. అందులో ఎనభై శాతం మంది కొత్త పార్టీ అవసరం ఉందన్నారు. ఆ తర్వాత, ఆయన ఈ పార్టీకి “ది అమెరికా పార్టీ” అనే పేరును ప్రతిపాదించారు.
ట్రంప్ పార్టీ పెడతానని బెదిరిస్తున్నారు కానీ.. ఈ పార్టీని స్థాపించడానికి ఎటువంటి అధికారిక చర్యలు తీసుకోలేదు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం అనేది సంక్లిష్టమైన ప్రక్రియ. రాష్ట్రాల వారీగా బ్యాలెట్ యాక్సెస్ చట్టాలు, రాజకీయ పార్టీలకు విరాళాలపై పరిమితులు ఉన్నాయి. ద్విపార్టీ వ్యవస్థ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడం అంత తేలిక కాదు. గతంలో రూజ్వెల్ట్ లాంటి వారు పార్టీలు పెట్టినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అయితే రాజకీయ పార్టీ పెట్టినా ..ప్రజలు స్వాగతించినా ఎలాన్ మస్క్ అధ్యక్షుడు కాలేరు. ఎందుకంటే ఆయన జన్మతహా: అమెరికన్ కాదు.