హోమ్ లోన్ వడ్డీ రేట్లను బ్యాంకులు ఇటీవలి కాలంలో వరుసగా తగ్గిస్తూ వస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేట్లను తగ్గించడమే దీనికి కారణం. అందుకే ఇళ్లు కొనాలనుకుకునేవారు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. అతి తక్కువ వడ్డీ రేట్లు ఏ బ్యాంకుల్లో ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. అయితే వడ్డీరేట్లకు.. సిబిల్ స్కోర్లకు ఇప్పుడు లింక్ ఉంది. సిబిల్ స్కోర్ బాగా ఉంటే ఇప్పుడు 7.35శాతం వడ్డీ రేటుకు రుణాలు లభిస్తున్నాయి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు 7.35% నుండి ప్రారంభం అవుతున్నాయి. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ఇదే రేట్లకు హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. కానీ ఇంత తక్కువకు రావాలంటే అత్యుత్తమ క్రెడిట్ ప్రోఫైల్ ఉండాలి. అలాగే కెనరా బ్యాంక్ 7.40% నుండి వడ్డీ రేట్లు ప్రారంభిస్తోంది. ఇండియన్ బ్యాంక్లో కూడా ఈ వడ్డీరేటుకు లోన్ పొందవచ్చు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 7.50% నుండి ప్రారంభం అవుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఇదే రేటుకు రుణాలు ఇస్తున్నాయి.
ఇక ప్రైవేటు బ్యాంకులు, రుణ సంస్థలు కూడా వడ్డరేట్లను బాగా తగ్గించాయి. HDFC బ్యాంక్ 8.45 శాతం వడ్డీ రేటుతో రుణాలిస్తోంది. ICICI బ్యాంక్ 8.50 శాతం నుంచి ప్రారంభిస్తోంది. బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహింద్రా వంటి బ్యాంకులు కూడా పోటాపోటీగానే తక్కువ వడ్డీ రేట్లకు ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే అతి తక్కువ వడ్డీరేటు పొందాలంచే సిబిల్ స్కోర్ కీలకం. 750 లేదా అంతకంటే ఎక్కువ CIBIL స్కోర్ ఉన్నవారు సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లను పొందుతారు.