హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అత్యంత ఖరీదైనదిగా మారింది మోకిలా. ప్రభుత్వం వేసిన వేలంలో గజానికి లక్ష పైనే పలికింది. ఇక ప్రైవేటు లే ఔట్లలో పరిస్థితి గురించి చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా మోకిలాలో గజం స్థలం ధర రూ. 30 నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాంటిది వేలంలో ఒక్కసారిగా అంత పలకడంతో అక్కడ అంత డిమాండ్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే.. ఐటీ ఉద్యోగులంతా మోకిలాలో స్థలాలు, ఇళ్లు కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అర్థమవుతుంది.
మోకిలా హైదరాబాద్కు కాస్త దూరంగానే ఉంటుంది. అదే ప్లస్ పాయింట్ అయింది. పట్టణ ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా , నగర్ హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే అక్కడ ఇళ్లు, స్థలాలు, విల్లాలు కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మోకిలాలో అన్ని సౌకర్యాలు అభివృద్ధి చేసిన లే ఔట్లలో ఎక్కువ వరాలు ఉన్నాయి. కాస్త లోపలికి వెళ్తే – 200 చ.గ. ప్లాట్ 30 లక్షలకు లభిస్తోంది. కాస్త ప్రైమ్ లొకేషన్ అయితే రెట్టింపు ధర పలుకుతోంది. HMDA ఆమోదిత, గేటెడ్ కమ్యూనిటీలలో 400 గజాల ప్లాట్లు అమ్ముతున్నారు. ఇవి కోటి రూపాయల నుండి ప్రారంభమవుతున్నాయి.
HMDA ఆమోదిత ప్లాట్లు అందుబాటులో, ఇవి రీసేల్ విలువ, లోన్ అర్హత, చట్టపరమైన భద్రతను అందిస్తాయి. మోకిల నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి 20 కి.మీ. దూరంలో ఉంటుంది. రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్ట్ చేవెళ్ల దగ్గరగా వెళ్తుంది. మోకిలలో గత 15 ఏళ్లలో ధరలు 10 రెట్లు పెరిగాయి. పలు బడా కంపెనీలు ఇప్పటికే అక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. మోకిలా ఇప్పటికే ప్రీమియం కేటగిరిలో చేరిపోయింది. కాస్త స్తోమత ఉన్న వారు ప్రశాంతంగా ఉండటానికి అనువైన ప్రాంతంగా మారింది.